Begin typing your search above and press return to search.

బన్నీ అట్లీ.. త్రివిక్రమ్ కు కూడా లాభమే..

పుష్ప 2తో బన్నీ కెరీర్ లో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచింది.

By:  Tupaki Desk   |   13 May 2025 10:30 AM
Allu Arjun and Atlee Pan-World Project
X

పుష్ప 2తో బన్నీ కెరీర్ లో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచింది. అలాంటి హైప్ ఉన్న సమయంలోనే బన్నీ తదుపరి ప్రాజెక్టులపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తమిళ మాస్ డైరెక్టర్ అట్లీతో బన్నీ చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని ఇప్పటికే నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటికే ముంబైలో పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.

అట్లీ - బన్నీ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించినవే. ‘జవాన్’తో బాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించిన ఆయన, ఇప్పుడు బన్నీని అంతకుమించి రేంజ్ లో ప్రెజెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అట్లీ బన్నీకి కథ వివరించేటప్పుడే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా గ్రాస్ సాధించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో బన్నీ కూడా పూర్తి స్థాయిలో టైమ్ కేటాయించేందుకు సిద్ధమయ్యాడు.

ఇది వాస్తవానికి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కు వచ్చిన బ్రేక్. బన్నీ మొదటగా త్రివిక్రమ్ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. కథ కూడా ఓకే అయ్యింది. కానీ అట్లీ విజన్ చూసిన తరువాత బన్నీ యూ టర్న్ తీసుకున్నాడు. మొదట 8 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్ట్ అనుకున్నా.. ఇప్పుడు ఏడాది నుంచి రెండేళ్ళ వరకూ టైమ్ పట్టేలా ప్లాన్ మారింది. హై టెక్నికల్ విజువల్స్, గ్రాఫిక్స్ కావడంతో ఈ సినిమా పాన్ వరల్డ్ స్కేల్ లో తెరకెక్కనుంది.

ఈ పరిణామాల వలన త్రివిక్రమ్ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే ఇది త్రివిక్రమ్ కు కూడా లాభమే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే బన్నీ అట్లీ సినిమా తర్వాత ఇంకొక రేంజ్ లో క్రేజ్ పెరుగుతుంది. అప్పుడు త్రివిక్రమ్ బన్నీ కాంబోకి మార్కెట్ మరింత భారీగా మారుతుంది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో హీరోతో ప్రాజెక్ట్ చేయవచ్చు. అదే సమయంలో బన్నీ కోసం రాసిన కథను ఇంకా మెరుగ్గా మలుచుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో బన్నీ ప్రాజెక్టులపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఒకవైపు బన్నీ మేకోవర్, మరోవైపు అట్లీ మాస్ టచ్.. ఈ రెండూ కలిస్తే పాన్ వరల్డ్ మార్కెట్ లో బన్నీ బ్రాండ్ ఇంకొక లెవెల్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలువురు టెక్నీషియన్స్ హాలీవుడ్ స్థాయిలో సినిమా వస్తుందని చెప్పడం విశేషం. బన్నీ అట్లీ కాంబో ఎంత క్లిక్ అవుతుందో చూడాల్సి ఉంది కానీ, త్రివిక్రమ్ మాత్రం ఈ గ్యాప్‌ను మంచి అవకాశంగా మార్చుకుంటే వచ్చే సినిమా భారీగా హిట్టవ్వడం ఖాయం.