బన్నీ కోసం అట్లీ ఐదుగురిని ఫిక్స్ చేస్తున్నాడా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో హాలీవుడ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్‌లతో ఈ భారీ ప్రాజెక్ట్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు అట్లీ తెరపైకి తీసుకొస్తున్నారు.
By: Tupaki Desk | 23 May 2025 3:47 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో హాలీవుడ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్‌లతో ఈ భారీ ప్రాజెక్ట్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు అట్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన అట్లీ ఈ పనులను ప్రారంభించారు.
హాలీవుడ్ సూపర్ హీరోల చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మూడు వేరు వేరు ప్రపంచాల్లో జరిగే కథగా దీన్ని అట్లీ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం బన్నీకి జోడీగా పాపులర్ స్టార్స్ నటిస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. విజువల్స్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తున్న అట్లీ గ్లామర్ పరంగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇందులో భాగంగానే ఈ మూవీ కోసం ఏకంగా ఐదుగురు క్రేజీ హీరోయిన్‌లని ఫైనల్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో ముందుగా బాలీవుడ్ క్రేజీ లేడీ దీపికా పదుకునే పేరు వినిపిస్తోంది. దీపికతో పాటు మృణాల్ ఠాకూర్, అనన్య పాండే, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సేలని కూడా సెలెక్ట్ చేయబోతున్నాడట. ఈ క్రేజీ కాస్టింగ్‌తో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ కావాలన్నది అట్లీ ఆలోచనగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఈ ఐదుగురు ఈ ప్రాజెక్ట్‌లో ఉంటారని మాత్రం ఇన్ సైడ్ టాక్. అయితే దీపిక పదుకునే విషయంలోనే అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల షరతుల కారణంగా సందీప్‌రెడ్డి వంగ ప్రాజెక్ట్ `స్పిరిట్` నుంచి తప్పుకున్న దీపికని కంట్రోల్ చేయడం అట్లీకి వీలవుతుందా? అని అంతా చర్చించుకుంటున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం `జవాన్`లో దీపికతో కలిసి వర్క్ చేసిన అట్లీకి అది పెద్ద మ్యాటరే కాదని, దీపికని తను కట్రోల్ చేయగలడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఉన్న నిజమెంత అన్నది తెలియాలంటే టీమ్ అధికారికంగా స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే.
