అల్లు అర్జున్ అట్లీ.. ఇంత ఫాస్ట్ గా ఉన్నారేంటి బాసు..!
పుష్ప 2 తర్వాత అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు అల్లు అర్జున్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.
By: Tupaki Desk | 6 Jun 2025 4:35 PMపుష్ప 2 తర్వాత అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు అల్లు అర్జున్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోతోనే సర్ ప్రైజ్ చేయగా నెక్స్ట్ మరో అప్డేట్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేయబోతున్నారు మేకర్స్. అల్లు అర్జున్ అట్లీ సినిమా నుంచి జూన్ 7న అనగా రేపు ఉదయం 11 గంటలకు ఒక అప్డేట్ రాబోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. అల్లు అర్జున్ సినిమా విషయంలో అట్లీ స్పీడ్ చూస్తుంటే ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.
ఐతే రేపు వచ్చే అప్డేట్ ఎలా ఉండబోతుంది అనుకుంటూ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అల్లు అర్జున్ తో అట్లీ ఈసారి పాన్ వరల్డ్ సినిమాతో రాబోతున్నాడని తెలుస్తుంది. అవెంజర్స్ టైపులో ఇండియన్ సూపర్ హీరో మూవీగా ఈ ప్రాజెక్ట్ వస్తుందని తెలుస్తుంది. ఐతే సినిమా విషయంలో అట్లీ స్పీడ్ చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అల్లు అర్జున్ అట్లీ ఈ కాంబో సినిమా మీద ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని అంటున్నారు.
సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం నలుగురు హీరోయిన్స్ ని తీసుకుంటున్నారన్న టాక్ నడుస్తుంది. వాళ్లు ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఐతే శనివారం అల్లు అర్జున్, అట్లీ సినిమా నుంచి వచ్చే అప్డేట్ ఏంటంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ సినిమా టైటిల్ ఏదైనా రివీల్ చేస్తారా లేదా హీరోయిన్స్ ని పరిచయం చేస్తారా అంటూ సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తన పూర్తిస్థాయి మేకోవర్ చూపించబోతున్నాడని తెలుస్తుంది. సినిమా విషయంలో అట్లీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదట. త్వరలోనే ఒక భారీ షెడ్యూల్ తో సినిమా స్పీడ్ ని మరింత పెంచేస్తారని టాక్. మొత్తానికి అల్లు అర్జున్ 22 సినిమా ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చేలా ఉంది. అట్లీ సినిమాను త్వరగా పూర్తి చేసి త్రివిక్రం తో మైథాలజీ మూవీని చేసేలా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్.