బన్నీ చాలా కష్టపడుతున్నాడు.. ఇదే సాక్ష్యం
తాజాగా బన్నీ చేతికి ఉండే స్మాట్ వాచ్ లో వర్కౌట్‌కి సంబంధించిన లెక్కలు చూపించాడు. 295 కేలరీలు బర్న్ అయ్యే విధంగా బన్నీ వర్కౌట్ చేశాడు.
By: Tupaki Desk | 22 May 2025 9:29 AMపుష్ప 2 తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2 సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్ సినిమాను చేయాల్సిన బన్నీ కొన్ని కారణాల వల్ల అట్లీ సినిమాను కమిట్ అయ్యాడు. చాలా స్పీడ్‌గా సినిమా పనులు జరుగుతున్నాయి. సినిమా అనుకున్నది మొదలుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను జెట్ స్పీడ్‌తో ముగించేందుకు దర్శకుడు అట్లీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీని ఈ సినిమాకు వినియోగించబోతున్నట్లు సినిమా ప్రకటన సమయంలోనే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర గురించి పలు ఆసక్తికర పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇప్పటి వరకు అట్లీ ఎలా బన్నీని చూపించబోతున్నాడు అనే విషయంలో క్లారిటీ రాలేదు. కానీ కచ్చితంగా గతంలో మాదిరిగా కాకుండా చాలా కొత్తగా, ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించని విధంగా బన్నీ కనిపించబోతున్నాడు అనిపిస్తుంది. అందుకోసం ఫిజికల్‌గా బన్నీ చాలా కష్టపడుతున్నాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో ఫిజికల్ ఫిట్‌నెస్‌కి వర్కౌట్‌లు చేస్తున్నాడు. సాధారణంగానే బన్నీ చాలా ఫిట్‌గా ఉంటాడు. రెగ్యులర్‌గా గంటల తరబడి వర్కౌట్‌లు చేస్తాడు. అయితే ఇప్పుడు ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ ఆధ్వర్యంలో కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో మరింతగా అల్లు అర్జున్ బాడీ రాటు తేలడం ఖాయం అని అభిమానులు నమ్ముతున్నారు.
గతంలో పలువురు స్టార్స్‌కి ఫిట్‌నెస్ ట్రైనర్‌గా వ్యవహరించిన లాయిడ్ వారి బాడీని అనూహ్యంగా మార్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్ బాడీ కూడా కొత్త రూపు సంతరించుకోవడం ఖాయం. అల్లు అర్జున్‌ను ఎంత కష్టపెడుతున్న విషయాన్ని లాయిడ్ రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా బన్నీ చేతికి ఉండే స్మాట్ వాచ్ లో వర్కౌట్‌కి సంబంధించిన లెక్కలు చూపించాడు. 295 కేలరీలు బర్న్ అయ్యే విధంగా బన్నీ వర్కౌట్ చేశాడు. అంతే కాకుండా ఆ సమయంలో హార్ట్ రేట్ అత్యధికంగా నమోదు అయింది. ఎంతగా బన్నీ కష్టపడుతున్నాడో ఈ నెంబర్స్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఇంత కష్టపడితే కచ్చితంగా ఓ రేంజ్ లుక్ రావడం ఖాయం.
అట్లీ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా అట్లీ జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. బన్నీ గత చిత్రం దాదాపుగా రూ.2000 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కనుక కచ్చితంగా మరో వెయ్యి కోట్ల సినిమా ఇండస్ట్రీకి దక్కబోతుంది అంటూ బన్నీ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్న వారు చాలా మంది ఉన్నారు. బన్నీ పుష్ప 2 తో క్రియేట్ చేసిన రికార్డ్‌ను అట్లీ సినిమాతో బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.