Begin typing your search above and press return to search.

AA22xA6 : ఎదురుచూపులకు తెర

అల్లు అర్జున్‌, అట్లీ కాంబో మూవీ ప్రకటన వచ్చి చాలా వారాలు అయింది. కానీ ఇప్పటి వరకు షూటింగ్‌ ప్రారంభం కాకపోవడంతో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి.

By:  Tupaki Desk   |   12 Jun 2025 12:23 PM IST
AA22xA6 : ఎదురుచూపులకు తెర
X

అల్లు అర్జున్‌, అట్లీ కాంబో మూవీ ప్రకటన వచ్చి చాలా వారాలు అయింది. కానీ ఇప్పటి వరకు షూటింగ్‌ ప్రారంభం కాకపోవడంతో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం ఎప్పుడు ఉంటుంది అంటూ సోషల్‌ మీడియాలో చర్చలు జరిగాయి. వాటన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ నేటి నుంచి అల్లు అర్జున్‌, అట్లీ కాంబో మూవీ షూటింగ్‌ ప్రారంభం అయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకునేను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. అయితే మొదటి షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటుందా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.


పుష్ప 2 తో అల్లు అర్జున్‌, జవాన్‌ సినిమాతో అట్లీ పాన్‌ ఇండియా స్థాయిలో స్టార్‌డం దక్కించుకున్నాడు. అలాంటి ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్‌, అట్లీ కాంబో మూవీని ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, జాతీయ మీడియా కథనాల ప్రకారం అల్లు అర్జున్‌-అట్లీ కాంబో మూవీని ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమా రూ.2000 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ బిజినెస్‌తో పాటు శాటిలైట్‌ బిజినెస్‌ రికార్డ్‌లను బ్రేక్‌ చేస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.

అల్లు అర్జున్‌, అట్లీ కాంబో మూవీ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అలాంటిది ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే సైతం నటిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సౌత్‌ ఇండియాలో కంటే ఈ సినిమా నార్త్‌ ఇండియాలో ఎక్కువ బిజినెస్ చేస్తుందని, అలాగే భారీ వసూళ్లు రాబడుతుందని అంతా నమ్ముతున్నారు. దీపికా పదుకునేను సినిమాలో నటింపజేయడంకు కారణం కూడా అదే అయ్యి ఉంటుందని విశ్లేషకుల వాదన. AAD కాంబో పాన్‌ ఇండియా రేంజ్‌లో విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకోవడం ఖాయం. అందుకు తగ్గట్లుగానే అట్లీ ఈ సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయి.

పుష్ప తర్వాత అల్లు అర్జున్‌ తదుపరి సినిమాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. అందుకోసం చర్చలు జరిగాయి, స్క్రిప్ట్‌ వర్క్‌ సైతం పూర్తి అయింది. కానీ కొన్ని కారణాల వల్ల త్రివిక్రమ్‌ దర్శకత్వంలో కాకుండా అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమాను ప్రారంభించాడు. నేటి నుంచి షూటింగ్‌ ప్రారంభించిన అట్లీ చాలా తక్కువ సమయంలోనే షూటింగ్‌ను ముగించే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌, కోలీవుడ్‌ వరకు అన్ని భాషల్లోనూ ఈ సినిమా రికార్డ్‌ స్థాయిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.