బన్నీ 22 లాంచింగ్ ఎక్కడ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 April 2025 11:30 AMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు దుబాయ్, అమెరికాలో జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమా లాంచింగ్ కి సంబంధించి మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమ్మర్ లోనే గ్రాండ్ గా ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రారంభోత్సవం ఎక్కడ ఉంటుంది? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అల్లు అర్జున్ సొంత గడ్డ హైదరాబాద్ అందుకు వేదిక అవుతుందా? అట్లీ- సన్ పిక్చిర్స్ స్వస్థలం చెన్నై అవుతుందా? ఈ రెండు గాక విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారా? అన్నది సంచలనంగా మారుతుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్ని భాషల్లో ఈ చిత్రాన్ని తెర కెక్కిస్తున్నారు? అన్నది తేలాలి. కేవలం తెలుగులో ప్లాన్ చేస్తున్నారా? లేక తెలుగుతో పాటు తమిళ్ లోనా? ఆ రెండు గాక హిందీ, తమిళ్ లో చేసి తెలుగులో డబ్ చేస్తారా? ఇలా కొన్ని సందేహాలున్నాయి.
ఆ సంగతి పక్కన బెడితే సాధారణంగా సినిమా లాంచింగ్ అన్నది హీరో సొంత గడ్డపైనే జరుగుతుంది. పరభాషా దర్శకుడైనా హైదరాబాద్ వచ్చి లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది తమిళనాడుకు చెందిన నిర్మాణ సంస్థ కావడంతో? లాంచింగ్ స్పాట్ చెన్నై అవుతుందా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. కొన్ని విషయాల్లో సన్ పిక్చర్స్ రాజీ పడదు.
కానీ ఇక్కడ హీరో తెలుగు నటుడు కాబట్టి? తన మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చి హైదరాబాద్ లోనే లాంచింగ్ ఉండాలని పట్టుబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా సన్ పిక్చర్స్ రాజీకి వస్తే లాంచింగ్ హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇలాంటి సమస్యలేవైనా హీరో-నిర్మాణ సంస్థ మధ్య తలెత్తే అవకాశం ఉంటే గనుక లాంచింగ్ విదేశాలు లేదా? ముంబైకి షిప్ట్ అయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.