Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ - అట్లీ డబుల్ సర్‌ప్రైజ్.. నాలుగు పాత్రలతో హై వోల్టేజ్ యాక్షన్?

అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్ లో కాదు, దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   13 July 2025 9:20 AM IST
ఐకాన్ స్టార్ - అట్లీ డబుల్ సర్‌ప్రైజ్.. నాలుగు పాత్రలతో హై వోల్టేజ్ యాక్షన్?
X

అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్ లో కాదు, దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ‘పుష్ప 2’తో వన్ మ్యాన్ షో చేసిన బన్నీ, మరోవైపు మాస్ మాస్టర్ అట్లీతో జతకట్టడం అభిమానులకు భారీ ట్రీట్ లా మారింది. ‘AA22xA6’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ భారీ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్ హీరోయిన్లను తీసుకుంటూ, సినిమాను గ్లోబల్ లెవెల్ లో తయారు చేస్తున్నారు.

ఈ సినిమా ప్రీ లుక్ వర్కింగ్ వీడియో, విజువల్స్‌ లోనే హాలీవుడ్ రేంజ్ కనిపించడంతో... ఇది సాధారణ పాన్ ఇండియా కాదని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు దగ్గరగా ఉండబోతుందని టాక్. అట్లీ గత సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్ మిక్స్ చేస్తూ విభిన్న కథనాలను అందించడంలో నిపుణుడు. ఇప్పుడు బన్నీతో చేసే ఈ సినిమా కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడట. అందులో ఒకటి తాత పాత్ర, మరోటి తండ్రి పాత్ర, మిగతా రెండు కొడుకుల పాత్రలు కావడం విశేషం. అంటే ఈ సినిమా పూర్తిగా ఒక ప్యారలల్ యూనివర్స్ నేపథ్యంలో నడవబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు తన కెరీర్ లో డ్యూయల్ రోల్ కూడా చేయని బన్నీ, ఈ సినిమా కోసం నాలుగు పాత్రలను పోషించడం మేజర్ సర్‌ప్రైజ్. ఇది ఆయన కెరీర్‌లోనే కొత్త ప్రయోగంగా నిలవబోతోందన్నది పక్కా.

బన్నీ గెటప్స్ లోని వైవిధ్యం, పాత్రల నడక, మాట్లాడే విధానం, ఎమోషన్ అన్నింటినీ స్పష్టంగా వేరుగా చూపించాల్సిన అవసరం ఉంది. ఇది అల్లు అర్జున్‌కి ఒకరకంగా యాక్టింగ్ ఛాలెంజ్ అవుతుంది. తాత, తండ్రి పాత్రల కోసం ఆయన శరీర భాషను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మాస్ యాక్షన్ లు, ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందట. అట్లీ ఇలాంటి మల్టీ షేడెడ్ పాత్రల్ని వర్కౌట్ చేయడంలో దిట్ట. గతంలో విజయ్‌కి ‘మెర్సల్’లో మూడు విభిన్న పాత్రలు ఇచ్చి మంచి విజయం అందుకున్నాడు.

ఇక సినిమాకు సంబంధించిన టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్‌ విషయానికొస్తే, సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ పేరు చర్చల్లో ఉంది. 20 ఏళ్ల వయసులోనే యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న అభ్యంకర్‌కి ఈ అవకాశం వస్తే అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుంది. అంతేకాదు, ఈ సినిమాకు భారీ స్థాయిలో VFX, ఇంటర్నేషనల్ గ్రాఫిక్స్ వాడుతున్నారట. కేవలం గ్రాఫిక్స్ కోసమే రూ. 350 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఓవరాల్‌గా చూస్తే, బన్నీ-అట్లీ కలయిక భారతీయ సినిమా హిస్టరీలోనే అత్యంత అంబిషస్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. నాలుగు పాత్రలు, భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, ఇంటర్నేషనల్ టెక్నికల్ టీమ్‌తో ఈ సినిమా ఓ బాహుబలి స్థాయి లెవెల్‌కు వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉంటాయో చూడాలి.