ఆ లిస్ట్ లోకి బన్నీ.. ఇప్పటికే బాలయ్య, సూర్య..
అయితే అనౌన్స్మెంట్ నుంచే వేరే లెవెల్ లో సినిమాపై బజ్ క్రియేట్ కాగా.. మూవీ నెవ్వర్ బిఫోర్ అనేలా అట్లీ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 8 May 2025 5:25 AMఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2 మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా అనౌన్స్మెంట్ రాగా, ప్రస్తుతం మేకర్స్ ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు మేకర్స్.
అయితే అనౌన్స్మెంట్ నుంచే వేరే లెవెల్ లో సినిమాపై బజ్ క్రియేట్ కాగా.. మూవీ నెవ్వర్ బిఫోర్ అనేలా అట్లీ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో క్యాస్టింగ్ ను ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో రానున్న ఆ మూవీలో అల్లు అర్జున్.. హీరో, విలన్ రోల్స్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దీనిపై అధికారికంగా ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ.. టాక్ మాత్రం నిజమేనని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ కన్నా ముందు కొందరు హీరోలు హీరో, విలన్ రోల్స్ ను పోషించారు. అలా రెండు క్యారెక్టర్స్ లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ లిస్ట్ లో బాలకృష్ణ, సూర్య, కమల్ హాసన్ తదితరులు ఉన్నారు.
సుల్తాన్ మూవీలో సూర్య, అభయ్ లో కమల్ హాసన్, రోబోలో రజినీకాంత్, మానవుడు దానవుడులో కృష్ణ, గోట్ లో విజయ్, ఫ్యాన్ లో షారుఖ్ ఖాన్, జగన్ లో శోభన్ బాబు సహా పలువురు హీరోలు.. డబుల్ క్యారెక్టర్స్ చేశారు. హీరో అండ్ విలన్ రోల్స్ లో కనిపించారు. కానీ వారిలో అందరూ మాత్రం హిట్స్ అందుకోలేకపోయారు.
ఇప్పుడు పై హీరోల లిస్ట్ లో అల్లు అర్జున్ కూడా చేరనున్నారు. అయితే విలన్ గెటప్ లో నెవ్వర్ బిఫోర్ అవతార్ లో ఆయన కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అట్లీ డిజైన్ చేసిన తీరు చూస్తే ఎవరైనా షాక్ అవ్వడం గ్యారెంటీ అని టాక్ వినిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కనుక విలన్ రోల్ డిజైనింగ్ ఊహించని రీతిలో ఉండనుందట.
ఇక మూవీ విషయానికొస్తే.. 2026లో సినిమా రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు హీరోయిన్స్ నటిస్తారని టాక్ వినిపిస్తోంది. అందులో సమంత ఒకరని వార్తలు రాగా.. ఆమె కాదని రీసెంట్ గా క్లారిటీ వచ్చింది. రూ.500 కోట్లకు బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఆ మూవీలో పలువురు విదేశీ నటులు కూడా ఉన్నారని తెలుస్తోంది. మరి బన్నీ- అట్లీ మూవీ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.