2027 క్రిస్ మస్ కి సాధ్యమయ్యే పనేనా..?
పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా అట్లీతో చేస్తున్నాడు.
By: Tupaki Desk | 12 May 2025 2:30 AMపుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా అట్లీతో చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని తెలుస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ మూవీని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారట. ఐతే ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అల్లు ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. సినిమాలో అల్లు అర్జున్ డబుల్ రోల్ అని వార్తలు రాగా.. సినిమాలో బన్నీ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడని హడావిడి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే అట్లీ సినిమాలు అన్నీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తాయి. ప్రీ ప్రొడక్షన్ లోనే సినిమా షెడ్యూల్, ప్రమోషన్స్, రిలీజ్ అన్నీ విషయాల గురించి డీటైల్డ్ గా ఫిక్స్ చేస్తారు. ముఖ్యంగా సినిమాను అనుకున్న డేట్ కి రిలీజ్ టార్గెట్ గా అట్లీ పెట్టుకుంటాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అట్లీ సినిమా వన్ ఇయర్ లో షూటింగ్ పూర్తి చేసి 3 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేసి మరో 3 నెలల్లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందట. అంటే 2025 నుంచి 2026 చివరి వరకు షూటింగ్ కే టైం తీసుకుంటున్నారట.
2026 లో షూటింగ్ పూర్తి కాకపోయినా 2027 ఫస్ట్ హాఫ్ లో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను పూర్తి చేసి 2027 సెకండ్ హాఫ్ అంటే దసరా లేదా క్రిస్ మస్ లో రిలీజ్ అనుకుంటున్నారట. అంటే రెండేళ్లలో ఈ సినిమా రిలీజ్ అవ్వాలన్నమాట. ఈ సినిమాను హాలీవుడ్ రిఫరెన్స్ లతో భారీ ప్లానింగ్ తోనే సిద్ధం చేస్తున్నారు. జస్ట్ అనౌన్స్ మెంట్ వీడియోనే ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేసింది. పుష్ప 1, 2 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది.
పుష్ప 1 తో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 తో కూడా మరోసారి జాతీయ అవార్డ్ అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఐతే అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమా కూడా అంచనాలకు మించి ఎవరి ఊహలకు అందని విధంగా ఉంటుందని అంటున్నారు. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఈ సినిమా సెట్ చేయబోతున్నారట. మరి ఇండియన్ తెర మీద రాబోతున్న ఈ సూపర్ హీరో మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.