Begin typing your search above and press return to search.

వన్ ఇయర్ లో మడతపెట్టేసే ప్లానా..?

అట్లీ, అల్లు అర్జున్ ఏదో అవెంజర్స్ సూపర్ హీరోస్ తరహా సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది.

By:  Tupaki Desk   |   2 May 2025 6:00 AM IST
వన్ ఇయర్ లో మడతపెట్టేసే ప్లానా..?
X

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనుకున్న ఫ్యాన్స్ అంచనాలకు మించి అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అట్లీ కూడా సౌత్ లో సినిమాలు చేస్తూ చేస్తూ బాలీవుడ్ బాద్షా షారుఖ్ తో జవాన్ అంటూ సినిమా చేసి సూపర్ హిట్ ఇచ్చాడు. అట్లీ డైరెక్షన్ టాలెంట్ గుర్తించి అల్లు అర్జున్ త్రివిక్రం సినిమా పక్కన పెట్టి మరీ అతనితో సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ వీడియోనే అదిరిపోయింది.

అట్లీ, అల్లు అర్జున్ ఏదో అవెంజర్స్ సూపర్ హీరోస్ తరహా సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. ఐతే అందరిలా ఒకే కథను క్రేజ్ రాగానే 2 భాగాలుగా తీయకుండా అట్లీ ఒకే సినిమాగా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక మరోపక్క ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారట. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న అట్లీ అల్లు అర్జున్ సినిమా వన్ ఇయర్ లో పూర్తి చేయాలనే ఆలోచన లో ఉన్నారట.

అంటే సమ్మర్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుండగా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి 2026 చివర్లో సినిమా రిలీజ్ చేసేలా చూస్తున్నారట. అదే జరిగితే నిజంగా అట్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. ఈమధ్య పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా మొదలు పెట్టే టైం లో వన్ ఇయర్ లో పూర్తి చేయాలని అనుకుంటున్నా ఏవో కారణాల వల్ల రెండేళ్లు కొన్ని సినిమాలైతే 3 ఏళ్ల దాకా టైం తీసుకుంటున్నాయి.

అందుకే అట్లీ అల్లు అర్జున్ సినిమా అలా కాకుండా సినిమా అనుకున్న టైం కు పూర్తి చేసేలా ప్లానింగ్ చేస్తున్నారట. అల్లు అర్జున్ కూడా అట్లీ సినిమా త్వరగా పూర్తి చేసి త్రివిక్రం తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.అట్లీ, త్రివిక్రమ్ తో సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ పుష్ప 3 పూర్తి చేయాల్సి ఉంది. ఈలోగా సుకుమార్ కూడా రామ్ చరణ్ సినిమాను ఫినిష్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. సో బన్నీ నెక్స్ట్ 3 సినిమాలు కూడా ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.