బన్నీ- అట్లీ మూవీ.. మృణాల్ కాకుండా మరో ఇద్దరు కూడా..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 26 April 2025 11:05 AM ISTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రాజెక్టు గురించి వార్తలు వస్తుండగా.. రీసెంట్ గా బన్నీ బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. సన్ పిక్చర్స్ సంస్థ ఆ సినిమా విషయాలు పంచుకుంటూ వీడియో షేర్ చేసింది.
వీడియోలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చూపించిన మేకర్స్.. ఫ్యాన్స్ ఊహలకు అందని రీతిలో మూవీ ఉంటుందని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. అందుకోసం అట్లీ, అల్లు అర్జున్ లాస్ ఏంజెలెస్ లోని ప్రముఖ వీఎఫ్ ఎక్స్ సంస్థను సంప్రదించినట్లు వీడియోలో చూపించారు.
హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. సినిమాలో వీఎఫ్ ఎక్స్ కు ఎక్కువ ప్రాధాన్యమున్నట్లు వినికిడి. సమాంతర ప్రపంచం, పునర్జన్మ కాన్సెప్ట్ తో సినిమా రూపొందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025 రెండో పార్ట్ లో షూటింగ్ స్టార్ట్ అవ్వనుందని సమాచారం.
అయితే భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మిస్తున్న బన్నీ, అట్లీ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఓ రోల్ కోసం మృణాల్ ఠాకూర్‌ను రంగంలోకి దించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, కథా చర్చలు జరిగాయని, రీసెంట్ గా ముంబైలో లుక్ టెస్ట్ లో కూడా పాల్గొందని వినికిడి.
అదే సమయంలో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఫిక్స్ అయినట్లేనని సమాచారం. బాలీవుడ్ బ్యూటీలు జాన్వీ కపూర్, దీపికా పదుకొణెను మేకర్స్ ఇటీవల సంప్రదించారని తెలుస్తోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ తో చర్చలు జరిగిపోయాయని కూడా సమాచారం. ఆమె స్టోరీ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సినీ వర్గాల సమాచారం.
దీపికా పదుకొణెతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దానిపై క్లారిటీ రానుందని టాక్. ఏదేమైనా ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించే ముగ్గురు బ్యూటీలు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్లేనని సమాచారం. మరికొద్ది రోజుల్లో మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి మేకర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో..
