అల్లు-అట్లీ మూవీ... అప్పుడు వచ్చిన పుకారు నిజమే!
బన్నీ-అట్లీ సినిమా ప్రకటించిన సమయంలోనే ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ఆరుగురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
By: Tupaki Desk | 25 May 2025 2:00 AM ISTఅల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దాదాపుగా రూ.1900 కోట్ల వసూళ్లను పుష్ప 2 సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ జాబితాలో బన్నీ చేరి పోయాడు. దాంతో ఇప్పుడు ఆయన తదుపరి సినిమా ఏంటా అంటూ తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జవాన్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అట్లీ తో ప్రస్తుతం అల్లు అర్జున్ వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. వీరిద్దరి కాంబో అనగానే ఫ్యాన్స్‌లోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి.
సన్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో పొందని పారితోషికంను అల్లు అర్జున్ ఈ సినిమాకు గాను అందుకుంటున్నాడు అనే టాక్ సైతం వినిపిస్తుంది. మొన్నటి వరకు ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయెల్ రోల్ అనే వార్తలు వచ్చాయి. ఇటీవలే సినిమాలో బన్నీ సింగిల్ రోల్‌లో మాత్రమే కనిపించబోతున్నాడు అని క్లారిటీ వచ్చింది. అల్లు అర్జున్ ఒక్కడిగానే కనిపించబోతున్నాడు.. కానీ ఈ సినిమాలో హీరోయిన్స్ మాత్రం ఆరుగురు అనే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ఇప్పుడు కొత్తగా పుట్టుకు వచ్చింది కాదు. గతంలోనూ ఈ విషయమై ప్రముఖంగా ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.
బన్నీ-అట్లీ సినిమా ప్రకటించిన సమయంలోనే ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ఆరుగురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను మొదట్లో పుకార్లుగా కొందరు కొట్టిపారేశారు. కానీ అసలు విషయం ఏంటి అంటే అట్లీ-బన్నీ కాంబో మూవీ కోసం హీరోయిన్స్ ఆడిషన్ ప్రారంభం అయింది. దీపికా పదుకునే మొదలుకుని వివిధ భాషలకు చెందిన మొత్తం ఆరుగురు ముద్దుగుమ్మలను ఎంపిక చేసేందుకు టీం రెడీ అవుతోంది. ఇప్పటికే సన్ పిక్చర్స్ సంస్థ వారు కొంత మంది హీరోయిన్స్‌కి అడ్వాన్స్ రూపంలో భారీ మొత్తంను చెల్లించింది అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా, సినీ సర్కిల్ ద్వారా సమాచారం అందుతోంది.
కథ డిమాండ్ మేరకు అంత మంది ముద్దుగుమ్మలను ఈ సినిమాలో దర్శకుడు నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. ప్రముఖ ట్రైనర్ సమక్షంలో వర్కౌట్స్ చేస్తున్నాడు. కొత్తగా కనిపించడం కోసం బన్నీ కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నాడు. భారీ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను ఎక్కువ సమయం తీసుకోకుండా స్పీడ్‌గా షూటింగ్ ముగించే విధంగా అట్లీ ప్లాన్ చేస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్స్ విషయంలో షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
