Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్- అట్లీ.. 20 ఏళ్ళ కుర్రాడి గురించి ఏమంటున్నారు?

ఇప్పుడు అతని కోసమే సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అందుకు సాయి అభ్యంకర్ డెబ్యూ మూవీ డ్యూడ్ రిలీజ్ అవ్వడమే కారణం.

By:  Tupaki Desk   |   17 Oct 2025 11:24 PM IST
అల్లు అర్జున్- అట్లీ.. 20 ఏళ్ళ కుర్రాడి గురించి ఏమంటున్నారు?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఆమెతో పాటు మరికొందరు బ్యూటీలు కూడా సందడి చేయనున్నారు.

భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న బన్నీ - అట్లీ మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా మూవీ షూటింగ్ జరుగుతుండగా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అద్భుతమైన విజువల్స్‌ ను ఉపయోగిస్తున్నారు మేకర్స్. అదే సమయంలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ వర్క్స్ కంప్లీట్ చేస్తున్నారు. అతని వయసు 20 ఏళ్ళు.

ఇప్పుడు అతని కోసమే సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అందుకు సాయి అభ్యంకర్ డెబ్యూ మూవీ డ్యూడ్ రిలీజ్ అవ్వడమే కారణం. ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఆ మూవీకి సాయి మ్యూజిక్ అందించారు. నేడు ఆ సినిమా రిలీజ్ అవ్వగా.. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేక మందిని మీద ఆకట్టుకున్నాయి

కానీ కొందరు మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఫ్రెష్ నెస్ లేదని చెబుతున్నారు. క్వాలిటీ బాగున్నా.. ఇంకా ఎక్స్పీరియన్స్ అవసరమని అంటున్నారు. ఆ నేపథ్యంలోనే అల్లు అర్జున్ - అట్లీ మూవీకి ఏం చేస్తాడోనని మాట్లాడుకుంటున్నారు. పెద్ద ప్రాజెక్ట్ కనుక ఓ రేంజ్ లో అవుట్ ఫుట్ ఇవ్వాలంటే మరింత అనుభవం కావాలేమో అని అంటున్నారు. అలా అని తక్కువ అంచనా వేయకూడదు.

ఎందుకంటే చిన్న వయసులోనే మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు సాయి అభ్యంకర్. ఇప్పుడు డ్యూడ్ మూవీ విడుదల అవ్వగా.. ప్రస్తుతం వివిధ సినిమాలకు వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తోపాటు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వద్ద కీబోర్డ్ ప్రోగ్రామర్ గా వర్క్ చేయడం అభ్యంకర్ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

తన సోలో సింగిల్ కచ్చి సెరాతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ ను దక్కించుకున్నారు సాయి అభ్యంకర్. వరల్డ్ వైడ్ గా అత్యధిక సెర్చబుల్ సాంగ్స్ లో ఆ పాట ఒకటిగా నిలిచి సత్తా చాటింది. ఆ తర్వాత ప్రీతి ముకుందన్ తో ఆశ కూడా, మీనాక్షి చౌదరితో చేసిన సితిర పుతిరి సాంగ్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా విజి వీకురా అనే పాట రూపొందించగా.. అందరినీ మెప్పించింది. మరి సాయి అభ్యంకర్ ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.