Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో 1000 కోట్లు అలా సాద్య‌మే?

కోలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఇంత‌వ‌ర‌కూ 1000 కోట్ల వ‌సూళ్ల చిత్రం ఒక్క‌టీ లేదు.

By:  Tupaki Desk   |   26 May 2025 4:00 PM IST
కోలీవుడ్ లో 1000 కోట్లు అలా సాద్య‌మే?
X

కోలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఇంత‌వ‌ర‌కూ 1000 కోట్ల వ‌సూళ్ల చిత్రం ఒక్క‌టీ లేదు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్, త‌ల అజిత్, చియాన్ విక్ర‌మ్, సూర్య‌, కార్తీ లాంటి స్టార్లు ఉన్నా? గొప్ప క్రియేటివ్ డైరెక్ట‌ర్లు ఉన్నా? 1000 కోట్ల క్ల‌బ్ లో చేరింది లేదు. చివ‌రికి క‌న్నడ ప‌రిశ్ర‌మ కూడా ఆ క్ల‌బ్ లో చేరింది. ఇక టాలీవుడ్ పాన్ ఇండియా సంచ‌ల‌నాల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. 1000 కోట్లు అన్న‌ది తెలుగు ప‌రిశ్ర‌మ‌కి జుజూబీ లాంటింది.

దీంతో కోలీవుడ్ రేసులో ఎంత‌గా వెనుక‌బ‌డి ఉంద‌న్న‌ది అర్ద‌మ‌వుతుంది. అలా కొంత కాలంగా కోలీవుడ్ కి 1000 కోట్లు అన్న‌ది అంద‌ని ద్రాక్ష‌గా మారింది. ఇంత కాలం అంద‌ని ద్రాక్ష ఇప్పుడు అందే అవ‌కాశం ఉందా? అంటే అలా అనుకుని సంతృప్తి ప‌డాల్సిందో అర‌వ ప‌రిశ్ర‌మ‌. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానా య‌కుడిగా త‌మిళ్ మేక‌ర్ అట్లీ ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

దీన్ని స‌న్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుంది. స‌న్ నిర్మాణంలో ఇదే తొలి భారీ బ‌డ్జెట్ గా రూపొందు తుంది. ఈ సినిమా మాత్రం 2000 కోట్ల వ‌సూళ్ల టార్గెట్ గా బ‌రిలోకి దిగుతుంది. ఇప్ప‌టికే ఈ ఫీట్ ను బ‌న్నీ పుష్ప సాధించి టాలీవుడ్ ని శిఖ‌ర స్థానానికి తీసుకెళ్లాడు. అట్లీ కూడా జ‌వాన్ తో 1400 కోట్ల వ‌సూళ్లు చిత్రం చేసాడు. కాక‌పోతే అది హిందీ లో కాబ‌ట్టి కోలీవుడ్ కి ఆ క్రెడిట్ ద‌క్క‌దు. అలా కోలీవుడ్ అట్లీ ట్యాలెంట్ ను స‌రిగ్గా వాడుకోలేక‌పోయింది.

బ‌న్నీ చిత్రం హిట్ అయితే మాత్రం ఆ క్రెడిట్ స‌గ‌మైనా ద‌క్కుతుంది. హీరో తెలుగు వాడైనా? దాన్ని నిర్మిస్తుంది...ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది అంతా కోలీవుడ్ కి చెందిన వారే కాబ‌ట్టి స‌క్సెస్ అయితే క్రెడిట్ లో షేర్ ఇవ్వొచ్చు. అదే చిత్రాన్ని అట్లీ కోలీవుడ్ హీరోతో తీసి 1000 కోట్ల చిత్రాన్ని చేయ‌గ‌ల్గితే 100 శాతం క్రెడిట్ ద‌క్కేది. కానీ ఆ ఛాన్స్ లేదు.