Begin typing your search above and press return to search.

అట్లీ- బ‌న్నీ..సూర్య సైన్స్ ఫిక్ష‌న్‌ని ఫాలో అవుతున్నారా?

ఇదిలా ఉంటే తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మ‌రో కీల‌క అప్ డేట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

By:  Ravindar Gorantla   |   3 March 2026 5:00 AM IST
అట్లీ- బ‌న్నీ..సూర్య సైన్స్ ఫిక్ష‌న్‌ని ఫాలో అవుతున్నారా?
X

`పుష్ప 2`తో పాన్ ఇండియా బ్టాక్ బ‌స్ట‌ర్‌ని త‌న ఖాతాలో వేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీతో ల‌భించిన క్రేజ్‌తో ఇప్పుడు పాన్ వ‌ర‌ల్డ్ మూవీకి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. కోలీవుడ్‌ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీతో దీన్ని భారీ స్థాయిలో నెవ‌ర్ బిఫోర్ అనేంత‌గా తెర‌పైకి తీసుకొస్తున్నారు. కోలీవుడ్ బిగ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ స‌న్ పిక్చ‌ర్స్ ఈ ప్రాజెక్ట్‌ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది. బాలీవుడ్ సూప‌ర్ లేడీ దీపికా ప‌దుకునే కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఫ‌స్ట్ టైమ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌నుంది.

హాలీవుడ్ స్థాయి సూప‌ర్ హీరో మూవీగా రూపొందుతున్న ఈ సినిమా స్టార్టింగ్ నుంచి వార్త‌ల్లో నిలుస్తూ నెట్టింట వైర‌ల్ అవుతోంది. రీసెంట్ గా బ‌య‌టికొచ్చిన బ‌న్నీ లుక్, త‌న మేకోవ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. హాలీవుడ్ టెక్నీషియ‌న్‌లు వ‌ర్క్ చేస్తున్న ఈ మూవీలో బ‌న్నీ సూప‌ర్ హీరో త‌ర‌హా క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. అంతే కాకుండా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేప‌థ్యంలో ఈ మూవీ సాగుతుంద‌ని కూడా బ‌య‌టికి రావ‌డం తెలిసిందే. అంతే కాకుండా ఇందులో బ‌న్నీ మూడు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌ల‌లో త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు.

ఇందులో విల‌న్ క్యారెక్ట‌ర్ కూడా ఒక‌ట‌ని, ఈ క్యారెక్ట‌ర్‌ని బ‌న్నీ ఓ రేంజ్‌లో తెర‌పై ఆవిష్క‌రించాడ‌ని ఇన్ సైడ్ న్యూస్‌. ఇదిలా ఉంటే తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మ‌రో కీల‌క అప్ డేట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇందులో బ‌న్నీ మూడు విభిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌లో తండ్రీ, కొడుకు, విల‌న్‌గా క‌నిపించి షాక్ ఇవ్వ‌బోతున్నాడ‌ని తెలిసింది. ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌ని మ‌రింత కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తున్నార‌ని, ఈ క్యారెక్ట‌ర్‌తో ప్రోస్త‌టిక్ మేక‌ప్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో మ్యాజిక్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది. ఈ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ఏఐ జ‌న‌రేటెడ్ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతుండ‌టంతో ఈ ప్రాజెక్ట్ మ‌రింత‌గా హాట్ టాపిక్‌గా మారింది.

గ‌తంలో సూర్య హీరోగా విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్ష‌న్ టైమ్ ట్రావెల్ డ్రామా `24`. ఇందులో హీరో సూర్య తండ్రిగా, త‌న‌యుడిగా, విల‌న్‌గా ..ఇలా మూడు విభిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌లో త్రిపాత్రాభిన‌యం చేసి అద‌ర‌గోట్టాడు. ఇప్పుడు ఐకాన్ స్టార్, అట్లీ మూవీ కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతోందా? అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. కార‌ణం సేమ్ క్యారెక్ట‌ర్స్ తో సినిమా ఉంటుంద‌నే ఊహాగానాల నేప‌థ్యంలో ఈ కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది తెలియాలంటే టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

#AA22xA6 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీని ముంబై నేప‌థ్యంలో సాగే ఓ ఫాంట‌సీ యాక్ష‌న్ డ్రామాగా దీన్ని అట్లీ తెర‌కెక్కిస్తున్నాడు. పోరాట యోధురాలిగా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో దీపిక ప‌దుకునే న‌టిస్తుండ‌గా ర‌మ్య‌కృష్ణ‌, మోగిబాబు, జిమ్ స‌ర్భ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. బ‌న్నీ కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ 2027 స‌మ్మ‌ర్‌కు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.