#AA22 షూటింగ్ మొదలయ్యేదప్పుడే!
పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ ఆ క్రేజ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు.
By: Tupaki Desk | 2 May 2025 5:56 AMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఆఖరిగా వచ్చిన సినిమా పుష్ప2. ఈ సినిమాతో బన్నీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ ఆ క్రేజ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు.
అందులో భాగంగానే బన్నీ తన తర్వాతి సినిమాను అట్లీతో చేసేందుకు రెడీ అయ్యాడు. వాస్తవానికైతే పుష్ప తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలి. కానీ దాన్ని పక్కన పెట్టి మరీ అట్లీతో ప్రాజెక్టును చేయడానికి కారణం తన క్రేజ్ ను పెంచుకోవాలనుకోవడమే. అట్లీతో బన్నీ చేయబోయే సినిమాకు సంబంధించిన వర్క్ ఆల్రెడీ మొదలైపోయింది.
బన్నీ కెరీర్లో 22వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ను మొన్న బన్నీ బర్త్ డే సందర్భంగా ఇవ్వగా, ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. #AA22 రెగ్యులర్ షూటింగ్ జులై నుంచి మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
జులై లో కచ్ఛితంగా ఒక షెడ్యూల్ ను మొదలుపెట్టే ఆలోచనలో డైరెక్టర్ అట్లీ ఉన్నాడని తెలుస్తోంది. అంతేకాదు, ఫస్ట్ షూటింగ్ ముంబైలో జరగనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ షూటింగ్ కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినప్పటికీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ న్యూస్ నిజమేనని తెలుస్తోంది.
ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతుండగా, ఆ వర్క్స్ లో బన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే బన్నీకి లుక్ టెస్ట్ కూడా జరిగింది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా కోసం అట్లీ ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా రంగంలోకి దించుతున్నాడు. ఈ మూవీపై ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ అయింది.