Begin typing your search above and press return to search.

బన్నీ - అట్లీ.. ఇలాగైతే పాన్ ఇండియా కాదు.. హాలీవుడ్ రేంజే!

అయితే అంచనాలకు తగ్గట్లుగానే మేకర్స్ సినిమాలో పలు ఇండస్ట్రీల నుంచి స్టార్ నటీనటులను తీసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   10 July 2025 9:00 PM IST
బన్నీ - అట్లీ.. ఇలాగైతే పాన్ ఇండియా కాదు.. హాలీవుడ్ రేంజే!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గతేడాది 'పుష్ప 2' సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్ల వసూల్ చేసి, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో బన్నీ తదుపరి సినిమా ఎలా ఉంటుందోనని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలు నిజమయ్యేలా బన్నీ, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 'AA 22 x A6' వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ వీడియో నెక్ట్స్ లెవెల్ లో ఉంది.

సినిమాలో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వాడనున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో స్టూడియోలు ఈ సినిమాకు పని చేస్తున్నాయి. భారతీయ సినిమాల్లోనే ఇది ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లో ఒకటిగా రూపొందుతోంది. గ్రాండ్ విజుల్స్తో ఉన్న వీడియో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది.

అయితే అంచనాలకు తగ్గట్లుగానే మేకర్స్ సినిమాలో పలు ఇండస్ట్రీల నుంచి స్టార్ నటీనటులను తీసుకుంటున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను ఎంపిక చేశారు.

అలాగే దీపికతోపాటు మరో నలుగురు హీరోయిన్లు ఈ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్, మృనాల్ ఠాకూర్, భాగ్య శ్రీ భోర్సే ఆయా పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. అలాగే సినిమాలో ఇంకో ఫీమేల్ లీడ్ కోసం మేకర్స్ ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందనను సంప్రదించారని సమాచారం. ఒక్క బాలీవుడ్ నుంచే దీపిక, జాన్వీ ఉండడం, సౌత్ నుంచి మృనాల్, రష్మిక, భాగ్య శ్రీ పేర్లు వినిపించడంతో ఫ్యాన్స్లో జోష్ పెరిగింది.

ఇక బాలీవుడ్ కాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం అట్లీ హాలీవుడ్ నటులను సైతం దింపుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో బన్నీది పవర్ఫుల్ పాత్ర అని, అందుకే తనకు ఆపోజిట్ క్యారెక్టర్ కూడా అంతే బలంగా ఉండాలని అట్లీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్ ను ఇందులో నెగెటివ్ రోల్ కోసం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. విల్ స్మిత్ కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే బన్నీ- అట్లీ సినిమా పాన్ఇండియా కాదు, ఇది హాలీవుడ్ సినిమా అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

సినిమా విజయానికి స్టోరీతో పాటు మ్యూజిక్ కూడా ఓ కారణం అవుతుంది. కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ సినిమాల బీజీఎమ్ లు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అట్లీ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ జాగ్రత్త పడుతున్నారు. ఈ బాధ్యతలు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ కు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.20ఏళ్ల అభ్యంకర్ గతేడాది 'కట్చీ సేర' అనే ప్రయివేట్ ఆల్బమ్ క్రియేట్ చేశాడు. ఈ పాట ఫుల్ ట్రెండ్ అయ్యింది. దీనికి యూట్యూబ్ లో 240 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో అభ్యంకర్ అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ కు అభ్యంకర్ నే తీసుకునేందుకు అట్లీ ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

గ్లింప్స్ తో ప్రాజెక్ట్ పై అంచనాలు పెరగడంతో ప్రేక్షకులకు నాణ్యమైన ఔట్ పుట్ ఇచ్చేందుకు మేకర్స్ అస్సలు కంప్రమైస్ అవ్వడం లేదట. సినిమాలో వీఎఫ్ ఎక్స్ మెయిన్ కాబట్టి ఇందుకు భారీగా ఖర్చు చేస్తున్నారని తెలిసింది. మొత్తం వీఎఫ్ ఎక్స్ పనులన్నీ అంతర్జాతీయ కంపెనీలతో చేయిస్తున్నారట. కేవలం వీఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ కు రూ.350 నుంచి 400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. అంటే తెలుగులో ఇండస్ట్రీ హిట్ సినిమాలు బాహుబలి, పుష్ప బడ్జెట్ ల కంటే చాలా ఎక్కువ అన్నమాట. ఇంతటి భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు ఉండడంతో ఈ సినిమా పక్కా పాన్ఇండియా హద్దులు సైతం చెరిపేసి, ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆదరణ దక్కించుకుంటుందని అంటున్నారు.