AA22పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బన్నీ
అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్లకు అట్లీ రంగంలోకి దింపడంతో ఇందులో విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని అందరూ అనుకున్నారు.
By: Tupaki Desk | 3 May 2025 12:30 PMతెలుగు సినిమా క్రేజ్ భారీగా పెరిగిన నేపథ్యంలో తెలుగులోని స్టార్ హీరోలంతా ఒకదాన్ని మించి మరొకటి ఉండేలా తమ సినిమాలను ప్లాన్ చేస్తూ అందరిలో ఆసక్తిని పెంచుతున్నారు. టాలీవుడ్ నుంచే హాలీవుడ్ రేంజ్ సినిమాలను తీస్తూ వాటి స్టాండర్డ్స్ ను పెంచుకుంటూ పోతున్నారు మేకర్స్. రీసెంట్ గా అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.
అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్లకు అట్లీ రంగంలోకి దింపడంతో ఇందులో విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని అందరూ అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కోసం తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అల్లు అర్జున్ రీసెంట్ గా వెల్లడించాడు. అట్లీ తన వద్దకు వచ్చి సినిమా ఐడియా చెప్పిన వెంటనే ఆ ప్రాజెక్టును ఓకే చేసినట్టు బన్నీ తెలిపాడు.
ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పిన బన్నీ, ఈ మూవీలోని వీఎఫ్ఎక్స్ ఇండియన్ ఆడియన్స్ కు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ను ఇస్తాయని, దాని కోసమే తమ టీమ్ వర్క్ చేస్తున్నట్టు బన్నీ తెలిపాడు. బన్నీ మాటల్ని బట్టి #AA22 ఎక్కువ భాగం విజువల్స్ ఎఫెక్ట్స్ మీదే ఆధారపడి ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.
బన్నీ ఈ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చిన #AA22 గురించి గతంలో అట్లీ మాట్లాడుతూ దీన్ని తన డ్రీమ్ ప్రాజెక్టు అనే విషయాన్ని రివీల్ చేసిన విషయం తెలిసిందే. కాబట్టి అట్లీ అన్ని విధాలా ఈ ప్రాజెక్టులో మరింత కేర్ తీసుకునే ఛాన్సుంది. బన్నీ తన నెక్ట్స్ మూవీ #AA22 గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరిలో ఎగ్జైట్‌మెంట్ ను పెంచుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా కోసం బన్నీ సరసన హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో టీమ్ ఆలోచిస్తుంది. జులై నుంచి సినిమాను మొదలుపెట్టి వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైమ్ కేటాయించాలని అట్టీ ప్లాన్ చేస్తున్నాడట. పుష్ప2 తో మంచి ఫేమ్ సంపాదించిన బన్నీ, జవాన్ తో బ్లాక్ బస్టర్ అందుకుని తన పేరుని దేశం మొత్తం మార్మోగేలా చేసిన అట్లీ కలిసి ఎలాంటి సినిమాను ఆడియన్స్ ను అందిస్తారో చూడాలి మరి.