బన్నీ - అట్లీ.. లైన్ లోకి ఆ బాలీవుడ్ బ్యూటీ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవబోతున్న AA22 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
By: Tupaki Desk | 12 April 2025 1:00 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవబోతున్న AA22 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుండగా, అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే ఇండస్ట్రీ మొత్తం ఈ కాంబినేషన్‌పై ఫోకస్ చేసింది. అట్లీ గతంలో 'జవాన్' వంటి చిత్రాలతో తనదైన మాస్ నేరేషన్‌కు పేరు తెచ్చుకున్నాడు. ఇక అల్లు అర్జున్, 'పుష్ప 2'తో తన మార్కెట్‌ను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన తరుణంలో ఈ కాంబినేషన్ ఎంతటి హైప్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇప్పటికే విడుదలైన ప్రకటన వీడియోలో ఉన్న విజువల్స్‌కే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. హై ఎండ్ వీఎఫ్ఎక్స్, విజువల్ ట్రీట్, థీమ్ పరంగా ఒక మాస్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా రూపొందుతోందని స్పష్టమైంది. బన్నీ ఈ సినిమాలో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ డాన్ పాత్రలో కనిపించనున్నాడన్నది ఇండస్ట్రీలో చర్చనీయాంశం. ఓవైపు ఎమోషన్.. మరోవైపు యాక్షన్.. ఇలా రెండు కోణాల్లోనూ సినిమా పుల్ మీల్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందట. ఇది పాన్ ఇండియా సినిమాలు చేసిన హీరోల్లో బన్నీకి మరింతగా స్థిరత తీసుకొచ్చే ప్రాజెక్ట్‌గా టాక్ వినిపిస్తోంది.
అట్లీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడట. కథ, స్క్రీన్‌ప్లే పూర్తిగా కొత్తగా ఉంటుందని, ఇది ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి ట్రీట్మెంట్‌తో రూపొందుతుందని సమాచారం. ఈ చిత్రానికి సన్ పిక్చర్స్‌తో పాటు జీ స్టూడియోస్ కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. మేకర్స్ ప్రస్తుతం షూటింగ్ కోసం లొకేషన్స్ చూసుకుంటున్నారు. మే చివరినాటికి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు అట్లీ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పని చేయనున్నారని సమాచారం.
ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇంతకు ముందు సమంత పేరు వినిపించినా, ఇప్పుడు జాన్వీ పేరు జోరుగా ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఆమె తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్ తో 'పెద్ది'లో నటిస్తోంది. ఇక బన్నీతో కలిసి నటిస్తే, దక్షిణాది మార్కెట్లో తన క్రేజ్‌ను మరింత పెంచుకునే అవకాశముంది.
జాన్వీ గ్లామర్‌తో పాటు అద్భుతంగా నటించగలిగే నటి అన్న పేరును కూడా కొంతవరకూ పొందింది. అలాంటి స్టార్ కాంబినేషన్‌ను అట్లీ తన కథకు తగ్గట్లుగా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇది ఇద్దరు కథానాయికల కథ అనిపించడంతో, మరో హీరోయిన్‌ను తీసుకునే యోచనలో కూడా మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ అగ్రతారలతో ముస్తాబవుతుంది.
బన్నీ మాఫియా డాన్ పాత్రలో కనిపించనుండటంతో, కథానాయికలకు ఇందులో పాత్రలకు వెయిట్ ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇది కేవలం ఓ మాస్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా, ఎమోషనల్ లెవెల్‌లోనూ కట్టిపడేసే చిత్రంగా రూపొందించనున్నారని సమాచారం. మొత్తానికి బన్నీ – అట్లీ కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ.800 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్ ఎంట్రీ ఖరారైతే, అది ఒక హై ప్రొఫైల్ కాంబోగా నిలవనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలుకానుండగా, మిగతా టెక్నీషియన్ మరియు నటీనటుల వివరాలు కూడా అధికారికంగా తెలియనున్నాయి.
