బన్నీ అట్లీ రూ.800కోట్లు.. ఎవరెవరికి ఎంతీచ్చారు?
పుష్ప సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ స్టార్ అట్లీతో జత కట్టిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 26 July 2025 3:00 PM ISTపుష్ప సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ స్టార్ అట్లీతో జత కట్టిన విషయం తెలిసిందే. AA22xA6 ప్రాజెక్ట్ టైటిల్ తో ఇది తెరకెక్కనుంది. గత ఏప్రిల్ లో బన్నీ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమా కన్ఫార్మ్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
అయితే ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరక్కిస్తున్నట్లు వీడియో చూస్తేనే తెలుస్తోంది. ఈ గ్లింప్స్ ప్రాజెక్ట్పై అంచనాలు అమానంతం పెంచేసింది. దర్శకుడు అట్లీ ఈ సినిమాలో గ్రాఫిక్స్, వీఎఫ్ ఎక్స్పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అటు అట్లీకి కూడా మేకర్స్ ఖర్చు విషయంలో ఫ్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి అంతర్జాతీయ వీఎఫ్ ఎక్స్ కంపెనీలు పని చేస్తున్నాయి. వివిధ ఇంటర్నేషనల్ స్టూడియోలు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగం కానున్నట్లు తెలుస్తోంది.
అటు అల్లు అర్జున్ లుక్ కూడా మునుపెన్నడూ లేని విధంగా ఉండనుంది. యానిమేటెడ్ వెర్షన్ లో బన్నీ పాత్ర ఉండనుంది. ఈ పాత్ర డిజైన్ కూడా భారీ రేంజ్ లో ఉండనుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థపై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు రూ.750-800 కోట్ల ఖర్చు అవుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం నడుస్తోంది.
ఇందులో నటించేందుకు బన్నీ భారీ మొత్తంలోనే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన రూ.150- 160 కోట్ల రెమ్యూనరేషన్ తోపాటు రూ.22-25 కోట్లు అదనంగా పర్సెంటేజీ డీల్స్ తో తీసుకోనున్నట్లు ప్రచారంలో ఉంది. డైరెక్టర్ అట్లీ రూ.100 కోట్లు అందుకోనున్నాడట. ఇక వీఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ కు రూ.240-250కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మెయిన్ లీడ్ లో ఎంపిక కాగా, మృణాల్ ఠాకూల్ కీలక పాత్రకు ఎంపిక చేశారట. ఈ ఇద్దరితోపాటు రష్మిక మంధన్నా కూడా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే రూ.200 కోట్లు ప్రొడక్షన్ ఖర్చు, ఇతరత్ర ఖర్చులు రూ.100 కోట్లా దాకా కావొచ్చని అంచనా. అలా అన్ని ఖర్చులు కలుపుకుంటే మొత్తం రూ.750- 800 కోట్ల బడ్జెట్ అవుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
