నవంబర్ వరకూ బన్నీ-అట్లీ అక్కడేనా?
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తో 'జవాన్' తెరకెక్కించిన సమయంలో ఇలాంటి ఛాన్స్ తీసుకోలేదు. నేరుగా సెట్స్ కి వె ళ్లిపోయారు.
By: Tupaki Desk | 11 May 2025 1:30 PMఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా మారుతోంది. అట్లీ 'జవాన్' తర్వాత టేకప్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో బజ్ పీక్స్ కి చేరింది. సినిమా ప్రారంభోత్సావానికి ముందే ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. దుబాయ్ లో స్టోరీ సహా ప్రీ ప్రొడక్షన్ పనులు జరగడం...న్యూయార్క్ స్టూడి యోలను ఇరువురు చుట్టేయడంతో ఇద్దరు ఏం చేస్తున్నారో? అర్దం కాని పరిస్థితి ఏర్పడింది.
ఈసారి అట్లీ కథను టెక్నికల్ గా హైలైట్ చేస్తున్నట్లు ముందే క్లారిటీ వచ్చేస్తుంది. ప్రీ ప్రొడక్షన పనులే కొన్ని నెలలు పాటు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చిత్రాన్ని నవంబర్ లో ప్రారంభోత్సవం చేయాలని ప్లాన్ అట. అప్పటి వరకూ ప్రీ ప్రొడక్షన్ తో పాటు అవసరమైన వర్క్ షాపులు కూడా నిర్వహిస్తారుట. వర్క్ షాపుల కోసమే నాలుగు నెలలు సమయం కేటాయిస్తున్నారుట. ఇంత వరకూ అట్లీ ఏ సినిమాకు వర్క్ షాపులు నిర్వహించలేదు.
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తో 'జవాన్' తెరకెక్కించిన సమయంలో ఇలాంటి ఛాన్స్ తీసుకోలేదు. నేరుగా సెట్స్ కి వె ళ్లిపోయారు. చకాచకా ముగించి రిలీజ్ కు వచ్చేసారు. కానీ బన్నీ చిత్రం టెక్నికల్ గానూ కీలకం కావడంతో వర్క్ షాపులు ప్లాన్ చేసారు. ఇందులో బన్నీతో పాటు హీరోయిన్లు ఇతర టీమ్ అంతా పాల్గొం టుంది. అలాగే సినిమాలో అండర్ వాటర్ సీన్స్ కొన్ని ఉన్నాయట.
సినిమాలో ఇవి చాలా కీలకమైన సన్నివేశాలని అంటున్నారు. అండర్ వాటర్ సీన్స్ మేకింగ్ అంటే అంత సులభం కాదు. అవసరం మేర విదేశీ బృందాన్ని దించాల్సి ఉంటుంది. ప్రఖ్యాత స్టూడియల్లో ఆ సన్నివే శాలకు సంబంధించి విఎఫ్ ఎక్స్ , సీజీ పనులు నిర్వహించాల్సి ఉంటుంది. చిత్రీకరణ అనంతరం సీజీ కోసమే ఆరేడు నెలలు సమయం తీసుకుంటారని సమాచారం. అలాగే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు? అన్న ప్రచారం ఇప్పటికే తారా స్థాయికి చేరింది.