అల్లు ఫ్యామిలీ హైదరాబాద్ సిటీనే రౌండప్ చేసారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్. `దంగల్` తర్వాత బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప-2' పేరిట ఓ రికార్డే ఉంది.
By: Tupaki Desk | 27 July 2025 3:42 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్. `దంగల్` తర్వాత బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప-2' పేరిట ఓ రికార్డే ఉంది. ఇంతింతై వటుడింతైన చందంగా బన్నీ ఎదుగు తున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ లో తానో బ్రాండ్ గా మారుతున్నాడు. బాలీవుడ్ లో హిందీ హీరోల రికార్డులనే చెరిపేసాడు అంటే? బన్నీ ఛేజింగ్ ఎలా ఉందన్నది అద్దం పడుతూనే ఉంది. అటు బన్నీ సొంతంగా మల్టీప్లెక్స్ లు నిర్మిస్తూ థియేటర్ రంగంలోనూ రాణిస్తున్నాడు.
ఏషియన్ సినిమా భాగస్వా మ్యంతో కలిసి ఇప్పటికే ఏఏ పేరిట కొన్ని మల్టీప్లెక్స్ లు కూడా నిర్మించాడు. వైజాగ్ ఇనార్బిట్ మాల్ లో కూడా ఏఏ మాల్ రెడీ అవుతోంది. అటు హైదరాబాద్ లో ఇప్పటికే ఇలాంటి మల్టీప్లెక్స్ కొలువుదీరింది. ఈ నేపథ్యంలో భాగ్యనగరం వేదికగా మరిన్ని మల్టీప్లెక్స్ లకు అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. అరవింద్ పేరిట ఇప్పటికే కోకాపేటలో భారీ ల్యాండ్ ఉంది. అందులో అల్లు స్టూడియోస్ కోసం కొంత భూ భాగాన్ని వినియోగిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఫిల్మ్ స్టూడియో నిర్మాణం జరుగుతోందక్కడ.
తాజాగా ఇప్పుడు అదే ప్రాంగణంలో మరొక ప్రధాన ప్రాజెక్ట్, అల్లు సినిమాస్ పేరిట ఓ థియేటర్ కూడా నిర్మిస్తున్నట్లు తెలిసింది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ థియేటర్ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2026 సంక్రాంతి నాటికి ప్రారంభిచాలన్నది లక్ష్యంగా పని చేస్తున్నారు. కోకాపేట సమీపంలోని ఎలాంటి మల్టీప్లెక్స్ లేవు. అక్కడ వాసులు సినిమా చూడాలంటే? గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్ కు, పీవీఆర్ థియేటర్ కు రావాల్సిందే.
ఆ కొరతను గుర్తించిన అల్లు అరవింద్ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే అవుటర్ రింగ్ రోడ్ మీపంలో నివసించేవారికి అల్లు సినిమాస్ ప్రధాన వినోద కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇలాం టి మల్టీప్లెక్స్ లో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని కొలువు దీరే అవకాశం ఉంది. ప్రధాన పట్టణాలే టార్గెట్ గా కార్పోరేట్ కంపెనీలు నిర్మాణంలో భాగమవుతున్నాయి.
