ఒకే ఫ్రేమ్ లో అమీర్, బన్నీ.. అంతా సెట్ అయిపోతుందా?
ఒకే ఫ్రేమ్ లో ఒకరి కన్నా ఎక్కువ మంది స్టార్ హీరోలు కనిపిస్తుంటే సినీ ప్రియులకు, అభిమానులకు పండుగే పండుగ.
By: Tupaki Desk | 7 May 2025 6:25 AMఒకే ఫ్రేమ్ లో ఒకరి కన్నా ఎక్కువ మంది స్టార్ హీరోలు కనిపిస్తుంటే సినీ ప్రియులకు, అభిమానులకు పండుగే పండుగ. ఇప్పుడు అలాంటి ఫోటోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. దీంతో ఆ పిక్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
తాజాగా అల్లు అర్జున్.. అమీర్ ఖాన్ ఆయన నివాసంలో కలిశారు. ముంబయి వెళ్లిన బన్నీ.. అమీర్ తో కాసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో దిగిన ఫోటోనే ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది. అదే సమయంలో కొత్త చర్చలకు దారి తీసింది. ఇద్దరూ కలిసి మూవీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు.
భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు అడుగు పడినట్లు ఉందని కొందరు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఆ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ డెబ్యూ మూవీ చేస్తారని కూడా ఊహిస్తున్నారు. అయితే పుష్ప సిరీస్ చిత్రాలతో ఇప్పటికే అల్లు అర్జున్.. బీటౌన్ ను ఓ ఊపు ఊపేశారు. నెవ్వర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేశారు.
పుష్ప సీక్వెల్ తో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫ్యాన్ బేస్ ను కూడా వేరే లెవెల్ లో పెంచుకున్నారు. ఇప్పుడు అమీర్ ఖాన్ బ్యానర్ లో అల్లు అర్జున్.. తన డైరెక్ట్ హిందీ మూవీ చేస్తారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో నిజమెంతో ఉందో తెలియదు కానీ.. నెట్టింట మాత్రం వైరల్ అవుతున్నాయి.
అదే సమయంలో చాలా ఏళ్ల క్రితం అమీర్ ఖాన్ తో అల్లు అరవింద్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీనే. ఆ సమయంలో అల్లు అర్జున్, అమీర్ ఖాన్ కు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందట. అందులో భాగంగా ఇద్దరూ కలిసి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా బన్నీ, అమీర్ మీట్.. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారి కాంబోలో సినిమా సెట్ అయితే మాత్రం అటు ఆడియన్స్ కు.. ఇటు అల్లు అభిమానులకు పెద్ద పండుగ అనే చెప్పాలి. ఇప్పటికే పుష్ప సిరీస్ చిత్రాలతో ఓ రేంజ్ లో అలరించిన ఆయన.. ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటే ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి. మరి చూడాలి ఏం జరుగుతుందో..