Begin typing your search above and press return to search.

బన్నీ మరో బిగ్గెస్ట్ AAA!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల హైదరాబాద్ లో AAA అనే మల్టీప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 July 2023 12:49 PM GMT
బన్నీ మరో బిగ్గెస్ట్ AAA!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల హైదరాబాద్ లో AAA అనే మల్టీప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎప్పటినుంచో అల్లు అర్జున్ ఈ తరహాలో మల్టీప్లెక్స్ నిర్మించాలని అనుకుంటూ ఉన్నాడు. ఇక మొత్తానికి ఆ ధియేటర్ కు భారీ స్థాయిలో క్రేజ్ కూడా వచ్చింది. హైటెక్నాలజీతో లేటెస్ట్ ట్రెండ్ ము తగ్గట్టుగా బన్నీ ఏషియన్ అధినేతలతో కలిసి ఆ మల్టీప్లెక్స్ ను నిర్మించడం జరిగింది.

అయితే రాబోయే రోజుల్లో ఆ బ్రాండ్ ను మరింత విస్తరించే విధంగా బన్నీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా AAA మల్టీప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించాలి అని అల్లు అర్జున్ ఇటీవల ఏషియన్ అధినేతలతో మరోసారి చర్చలు జరిపినట్లు సమాచారం. తెలంగాణలో భారీ స్థాయిలో ఏషియన్ సినిమాస్ మిగతా హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ లను నిర్మిస్తోంది.

అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై కూడా ఫోకస్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అయితే ఎక్కడ నిర్మించనున్నారు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీగా రాలేదు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ తో చాలా బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పై అంచనాలు అయితే మామూలుగా లేవు.

ఫస్ట్ పార్ట్ భారీ స్థాయిలో రెస్పాన్స్ ఆదుకోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం అంతకుమించి అనేలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తోంది. మొదట 150 కోట్లతో నిర్మించాలని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ లెక్క 250 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మరో ప్రముఖ స్టార్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు ఆ మధ్య ఒక టాక్ అయితే వినిపించింది. ఇక చిత్ర యూనిట్ మాత్రం గాసిప్స్ ఎన్ని వస్తున్నా కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక మొన్నటి వరకు అయితే గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ కొనసాగింది. కానీ ఇటీవల సుకుమార్ తన పర్సనల్ ఫ్యామిలీ రీజన్స్ వలన విదేశాలకు వెళ్లడంతో కొంత బ్రేక్ అయితే వచ్చింది. మళ్ళీ త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.