అల్లు అర్జున్ - అట్లీ కథలో.. ఓ సెంటిమెంట్ ఉందట!
అల్లు అర్జున్ నటిస్తున్న ‘AA22’ (AA22xA6) సినిమా టాలీవుడ్‌లో భారీ హైప్‌ను సృష్టిస్తోంది.
By: Tupaki Desk | 2 Jun 2025 11:30 PMఅల్లు అర్జున్ నటిస్తున్న ‘AA22’ (AA22xA6) సినిమా టాలీవుడ్‌లో భారీ హైప్‌ను సృష్టిస్తోంది. ‘పుష్ప 2: ది రూల్’ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ కెరీర్ లో అత్యంత గ్రాండ్ గా ఈ సినిమా రెడీ కానుంది. అట్లీ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పాన్ ఇండియా యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇక దాదాపు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందనే సంకేతాలు కూడా అందుతున్నాయి.
ఇది మహేష్ రాజమౌళి సినిమా అనంతరం భారతీయ సినిమా చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచింది. 2026 చివరిలో ఈ సినిమా విడుదల కానుందని, దీని కోసం అల్లు అర్జున్ ప్రముఖ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌తో ఫిజికల్ ట్రైనింగ్‌లో బిజీగా ఉన్నాడు. అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ‘పారలల్ యూనివర్స్’ జానర్‌లో రూపొందుతోందని, హాలీవుడ్ VFX టీమ్‌లతో భారీ స్థాయిలో తెరకెక్కుతోందని సమాచారం.
ఇక దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వచ్చాయి, ఇది నిజమైతే ఆమెతో అల్లు అర్జున్ తొలి ఆన్ స్క్రీన్ కాంబినేషన్ కానుంది. అయితే, ఈ సినిమా కథ గురించి ఒక టాక్ వైరల్ అవుతోంది. తాజాగా, ‘AA22’ కథలో బ్రదర్స్ సెంటిమెంట్ ఉంటుందని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడని, అందులో ఒక మాఫియా గ్యాంగ్‌స్టర్, ఒక వారియర్, ఒక CGI క్యారెక్టర్‌గా నటిస్తాడని టాక్ నడుస్తోంది.
ఈ కథలో అల్లు అర్జున్ ట్విన్ బ్రదర్స్‌గా నటించే అవకాశం ఉందని, ‘జై లవకుస’ స్టైల్‌లో బ్రదర్స్ సెంటిమెంట్‌తో కథ సాగుతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న హెయిర్‌స్టైల్స్, విభిన్న స్లాంగ్‌లు, కాస్ట్యూమ్స్‌తో కనిపించనున్నాడని సమాచారం. అట్లీ ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీగా మార్చే ఆలోచనలో ఉన్నాడని, అల్లు అర్జున్ గ్యాంగ్‌స్టర్ రోల్ ‘ది గాడ్‌ఫాదర్’లోని మైఖేల్ కొర్లియోన్ క్యారెక్టర్‌ను పోలి ఉంటుందని మరొక టాక్ హాట్ టాపిక్ గా మాటుతోంది. ఇక సినిమా షూటింగ్ జూన్ 2025లో ప్రారంభమవుతుందని అంటున్నారు.
ఈ సినిమా భారతీయ విలువలతో కూడిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, అంతర్జాతీయ అప్పీల్‌తో రూపొందుతుందని సమాచారం. అలాగే ఒక విజువల్ స్పెక్టాకిల్‌గా నిలుస్తుందని, అట్లీతో కలిసి పనిచేయడం సులభంగా, ఆసక్తికరంగా ఉందని ఇదివరకే బన్నీ తెలిపాడు. సినిమా కోసం అల్లు అర్జున్ ఫిజికల్ ట్రైనింగ్‌తో పాటు మెంటల్ ప్రిపరేషన్‌లోనూ ఉన్నాడు. ఇక అతనికి కష్టానికి తగ్గట్టుగా సినిమా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.