అల్లు అర్జున్ - అట్లీ సినిమా.. రిలీజ్ ప్లాన్ సెట్టయినట్లే..
ఒకవైపు పాన్ వరల్డ్ రేంజ్ ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా, మరోవైపు ఈ ప్రాజెక్ట్‌పై ఎన్నో చర్చలు కొనసాగుతున్నాయి.
By: Tupaki Desk | 18 April 2025 8:30 AMపుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే అత్యంత భారీ ప్రాజెక్ట్ AA22. స్టార్ డైరెక్టర్ అట్లీతో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. జవాన్ తర్వాత అట్లీతో పని చేయడానికి సిద్ధమైన బన్నీకి ఇది పూర్తిగా ఓ కొత్త ప్రయోగం. మాస్ యాక్షన్ ఎమోషన్స్‌తో పాటు విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో రూపొందబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోకు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం గమనార్హం.
ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మించగా, సినిమాకు సంబంధించిన స్టైలిష్ ఎనౌన్స్ మెంట్ వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఇందులో అల్లు అర్జున్ యాక్షన్ మూడ్, అట్లీ హాలీవుడ్ ప్యాటర్న్ అన్నీ క్లారిటీగా కనిపించాయి. బన్నీ అభిమానులే కాదు, ఇండస్ట్రీ మొత్తం ఈ కాంబినేషన్‌కి ఎదురుచూస్తున్నట్టే ఉంది. ఒకవైపు పాన్ వరల్డ్ రేంజ్ ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా, మరోవైపు ఈ ప్రాజెక్ట్‌పై ఎన్నో చర్చలు కొనసాగుతున్నాయి.
తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న బజ్ ప్రకారం, AA22 సినిమాను 2026 డిసెంబర్ నెలకు విడుదల తేదీని ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజేషన్, క్యాస్టింగ్, VFX ప్లానింగ్ వంటి పనులు కొనసాగుతున్నాయి. జూన్ మధ్య నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారీ బడ్జెట్, హాలీవుడ్ టెక్నీషియన్లతో, వరల్డ్ క్లాస్ విజువల్స్‌తో ఈ సినిమాను రూపొందించేందుకు మేకర్స్ కసరత్తు చేస్తున్నారు.
ఈ సినిమాలో బన్నీకి సరసన బాలీవుడ్ నుంచి ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తుండగా, మరోవైపు జాన్వీ కపూర్‌ను కూడా సంప్రదించారని సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కథా నేపథ్యం మాఫియా అండ్ సైన్స్ ఫిక్షన్ ఎమోషన్లతో ఉంటుందని టాక్.
ఇక అట్లీ ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ బ్లూ ప్రింట్లు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. బన్నీ గత సినిమాలకు భిన్నంగా ఇందులో కొత్త షేడ్స్‌తో కనిపించబోతున్నాడని సమాచారం. సాంకేతికంగా ఇది పుష్ప 2 కంటే భారీ స్థాయిలో ఉంటుందని టాక్. అట్లీ గత చిత్రాల్లో ఉన్న స్టైల్, ఎమోషన్ మిక్స్ ఈ సినిమాకు హై లైట్ కానుంది. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్‌పై బజ్ అంతా ప్రస్తుతం “2026 డిసెంబర్” రిలీజ్ డేట్‌పైనే ఫోకస్ అవుతోంది. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవబోయే AA22 సినిమా నిజంగా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.