బన్నీపై నెగెటివ్ రూమర్స్.. లీగల్ యాక్షన్‌కు దిగిన ఐకాన్ స్టార్ టీమ్!
ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై తమ లీగల్ టీమ్ ద్వారా పరువు నష్టం కేసులు దాఖలు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
By: M Prashanth | 10 Feb 2026 6:19 PM ISTసోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి రకరకాల రూమర్స్ రావడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ నెట్టింట కొన్ని కామెంట్స్ హల్చల్ చేశాయి. ఒక పాడ్‌కాస్ట్‌లో బన్నీ మీటింగ్ ప్రోటోకాల్స్ గురించి వైరల్ అయిన వీడియోపై రకరకాల చర్చలు నడిచాయి. అయితే ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ టీమ్ ఇప్పుడు చాలా సీరియస్‌గా స్పందించింది.
అసలు వివాదం ఏంటంటే.. ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యువతి, అల్లు అర్జున్‌ను కలవడానికి 42 నిబంధనలు ఉంటాయని, ఆయన కళ్లలోకి చూడకూడదనే రూల్ ఉందని చెప్పడం పెద్ద దుమారం రేపింది. బన్నీ పర్సనాలిటీని కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విషయం మరింత ముదరకముందే టీమ్, వెంటనే రంగంలోకి దిగింది.
బన్నీపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, వాటిలో ఎలాంటి నిజం లేదని అల్లు అర్జున్ ఆఫీస్ అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. బన్నీ ఎప్పుడూ అత్యంత గౌరవప్రదంగా, హుందాగా నడుచుకుంటారని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. కేవలం అటెన్షన్ కోసం కావాలని కొందరు చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఇకపై సహించేది లేదని టీమ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
ఈ తప్పుడు ఆరోపణలను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు బన్నీ టీమ్ వెల్లడించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై తమ లీగల్ టీమ్ ద్వారా పరువు నష్టం కేసులు దాఖలు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఒక సెలబ్రిటీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే విధంగా అన్ వెరిఫైడ్ సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ తమ నోట్‌లో పేర్కొన్నారు.
ఫైనల్ గా బన్నీపై జరిగిన ఆ నెగెటివ్ ప్రచారానికి ఈ అఫీషియల్ నోట్‌తో ఫుల్ స్టాప్ పడినట్లయింది. ప్రస్తుతం అట్లీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలుస్తోంది. ఇక ఇలాంటి రూమర్స్ పట్ల తన టీమ్ ద్వారా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇకపై సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై కామెంట్స్ చేసే ముందు ప్రతి ఒక్కరూ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. ఇక అట్లీ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో కొనసాగుతోంది. ఇటీవల మొదలైన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా రానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.
