తెలుగోళ్లు ఎక్కడున్నా అస్సలు తగ్గేదేలే
ఈవెంట్ లో భాగంగా బన్నీ స్టేజ్ మీదకు రాగానే నీ యాంకరింగ్ రప్పా రప్పా అని శ్రీముఖిని పొగడటంతో ఆమె గాల్లో తేలిపోయారు. వేదికపై అల్లు అర్జున్ ను తానా స్పెషల్ గా సత్కరించారు.
By: Tupaki Desk | 6 July 2025 1:17 PM IST24వ తానా మహాసభలు ఎంతో ఘనంగా జరగ్గా, ఈ వేడుకల్లో పలు టాలీవుడ్ స్టార్లు సందడి చేశారు. ఈ ఈవెంట్ కు హాజరైన సెలబ్రిటీలు మాట్లాడిన మాటలు, వారు చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తానా ఈవెంట్ కు అల్లు అర్జున్, సుకుమార్, సమంత, దిల్ రాజు, రాఘవేంద్ర రావు, మైత్రీ నవీన్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈవెంట్ లో భాగంగా బన్నీ స్టేజ్ మీదకు రాగానే నీ యాంకరింగ్ రప్పా రప్పా అని శ్రీముఖిని పొగడటంతో ఆమె గాల్లో తేలిపోయారు. వేదికపై అల్లు అర్జున్ ను తానా స్పెషల్ గా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పుష్ప స్టైల్ లో బన్నీ తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా, వైల్డ్ ఫైర్ అని తనదైన స్టైల్ లో డైలాగ్ చెప్పారు బన్నీ.
ఎప్పుడు ఈ ఈవెంట్ కు వచ్చినా ఆశ్చర్యానికి గురవుతానని, ఇంతమంది తెలుగు వాళ్లను ఇక్కడ చూస్తుంటే హైదరాబాద్, వైజాగ్ లో ఉన్నట్టు అనిపిస్తుందని, మన తెలుగు కల్చర్ ను ముందు తరాలకు తీసుకెళ్తున్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అని, భారతీయలు ఎక్కడున్నా తగ్గేదేలే, అందులోనూ తెలుగోళ్లు అస్సలు తగ్గేదేలే అని అల్లు అర్జున్ అన్నారు.
50 ఏళ్ల తన దర్శక ప్రస్థానంలో తాను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఇక్కడ ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు అన్నారు. సుకుమార్‌కు తనకు మధ్య ఓ పోలిక ఉందని, అదే గడ్డమని నవ్వుతూ అన్నారు. తాను అడవి రాముడులో అడవిని నమ్ముకుని స్టార్ డైరెక్టర్ ను అయ్యానని, సుకుమార్ పుష్పలో అడవిని నమ్ముకుని స్టార్ డైరెక్టర్ అయ్యారని, బన్నీని స్టార్ హీరోని చేశావని సుకుమార్ ను ఉద్దేశించి రాఘవేంద్ర రావు అన్నారు.