ఈడీ ఎంక్వైరీపై అల్లు అరవింద్ స్పందన ఇదే..!
నేను 2017లో ఒక ప్రాపర్టీ కొన్నా.. ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి భాగం ఉంటే అది నేను కొన్నా.. ఆ తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఉంది అతను బ్యాంక్ లోన్ తీసుకొని కట్టలేదు.
By: Tupaki Desk | 4 July 2025 9:37 PM ISTటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురువారం ఈడీ విచారణలో పాల్గొన్నారన్న వార్తలు తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిర్మాతగా సినిమాలు చేస్తున్న అల్లు అరవింద్ ని ఈడీ ఎంక్వైరీకి పిలవడం పట్ల మీడియాలో ఇదే హాట్ న్యూస్ అయ్యింది.
ఐతే ఈ విషయంపై అసలు విషయం తెలియకుండానే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు రకరకాలుగా రాసుకొచ్చారు. ఐతే లేటెస్ట్ గా ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్. మీడియాలో తనపై వస్తున్న వార్తలన్నీ నిజం కాదని అన్నారు అల్లు అరవింద్.
లేటెస్ట్ గా ఈడీ ఎంక్వైరీ గురించి స్పందించిన అల్లు అరవింద్..
నేను 2017లో ఒక ప్రాపర్టీ కొన్నా.. ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి భాగం ఉంటే అది నేను కొన్నా.. ఆ తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఉంది అతను బ్యాంక్ లోన్ తీసుకొని కట్టలేదు.. దాని మీద ఈడీ ఎంక్వైరీ ఉంది. ఆ ఈడీ ఎంక్వైరీలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నా పేరు ఉన్నప్పుడు.. యాజ్ ఏ సిటిజెన్ గా ఈడీ వచ్చి అడిగినప్పుడు చెప్పాలి కదా.. అని దానికి సంబంధించి వివరణ ఇచ్చాను. దానికి సంబంధించిన అకౌంట్స్ అది అడిగారు.. అంతే తప్పితే మీడియాలో ప్రపోర్షనేట్ గా దీన్ని పెద్దది చేయడం జరుగుతుంది. వాళ్లేదో అడిగితే నేను చెప్పి వచ్చాను.. దీని గురించి ఇంతకుమించి మాట్లాడలేను అని అన్నారు అల్లు అరవింద్.
సినీ సెలబ్రిటీస్ విషయంలో మీడియా అత్యుత్సాహం తెలిసిందే. అక్కడ ఏం జరిగింది అన్నది అసలేమాత్రం సమాచారం రాకపోయినా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్లు వార్తలు ప్రచారం చేస్తారు. ఐతే ఈడీ ఎంక్వైరీ విషయంపై అల్లు అరవింద్ చెప్పిన విషయాన్ని బట్టి ఆయన క్లారిటీగానే ఉన్నారనిపిస్తుంది.
లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ టైం లో జరిగిన తొక్కీసలాట వళ్ల ఒక మహిళ మృతి చెందగా ఆ సంఘటన వల్ల అల్లు అర్జున్ ఒక పూట జైలులో ఉండి వచ్చాడు. ఐతే దాని నుంచి ఎలాగోలా బయట పడిన అల్లు అర్జున్ ఈమధ్యనే మళ్లీ తన నెక్స్ట్ సినిమా మొదలు పెట్టాడు. ఐతే ఇప్పుడు మళ్లీ అల్లు అరవింద్ ఈడీ ఎంక్వైరీలో పాల్గొనడం పట్ల అల్లు అభిమానులు టెన్షన్ ఫీల్ అవుతున్నారు.