అల్లు అరవింద్ తమిళుల కోసం ఫైట్ చేశారా?
తాజాగా ఈ ఉద్యమంపై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించారు. `విద్యార్థి నాయకుడిగా హిందీ వ్యతిరేకోద్యమంలో తాను ఎదుర్కొన్న అనుభవాల్ని ఆయన పంచుకున్నారు.
By: Tupaki Entertainment Desk | 16 Feb 2026 8:00 PM ISTఅల్లు అరవింద్..టాలీవుడ్‌లో వున్న అత్యంత స్టార్ ప్రొడ్యూసర్‌లలో ఆయన ఒకరు. ఇండస్ట్రీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా, మెగాస్టార్ చిరంజీవి బావమరిదిగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాదర్‌గా ఆయనకున్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల నిర్మాణంలో ఈ మధ్య పెద్దగా ఇన్‌వాల్వ్ కావడం లేదు. ఆ బాధ్యతల్ని యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసుకు అప్పగించి కేవలం ప్రజెంటర్‌గా మాత్రమే వ్యవహరిస్తూ వస్తున్నారు. అయినా సరే సినిమా ఈవెంట్‌లలో చురుగ్గా పాల్గొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
హిందీ వ్యతిరేకోద్యమం ఈ మధ్య విడుదలై `పరాశక్తి` సినిమాతో మళ్లీ నెట్టింట ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే. బలవంతంగా సౌత్ స్టేట్‌లపై, అందులో ముఖ్యంగా తమిళనాడుపై కేంద్రం రుద్దుతోందని 1960లో తమిళనాట హిందీ వ్యతిరేకంగా భారీ ఉద్యమమే నడిచింది. ఇందులో ఎంతో మంది విద్యార్థినాయకులు పాల్గొన్నారు. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా ఈ ఉద్యమంపై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించారు. `విద్యార్థి నాయకుడిగా హిందీ వ్యతిరేకోద్యమంలో తాను ఎదుర్కొన్న అనుభవాల్ని ఆయన పంచుకున్నారు.
ఓ యూట్యూబ్ ఛాన్ పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ తమిళనాట 1060లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంపై ఆనాటి జ్ఞాపకాల్ని పంచుకున్నారు. హిందీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో తమిళుల కోసం తాను ఎలా పోరాటం చేసింది చెప్పుకొచ్చారు. `పరాశక్తి` మూవీ స్టోరీ కోసం 60వ దశకంలో జరిగిన పోరాటంలో పాల్గొన్న విద్యార్థి నాయకులని కలిసి కీలక వివరాల్ని సేకరించే క్రమంలో దర్శకురాలు సుధా కొంగర ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ని కలిశారట. అది జరిగి 50 ఏళ్లకు పైనే అవుతోందని, అది తెలుసుకుని ఇప్పుడు ఏం చేస్తావని తనని అడిగానన్నారు.
అంతే కాకుండా తాను ఆ ఉద్యమంలో పాల్గొన్నానని తాను ఎలా తెలుసుకుందని ఆశ్చర్యపోయానన్నారు. తాను చెన్నైలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు హిందీ వ్యతిరేకోద్యమం జరిగింది. ఆ సమయంలో సహ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించేందుకు తాను సాహశక్తులా కృషి చేశానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆ సమయంలో జరిగిన ఓ సంఘటనని ఈ సందర్భంగా వివరించారు. ఓ ప్రభుత్వ బస్సుకు సంబంధించిన సంఘటన ఒకటి జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తోటి విద్యార్థుల్ని రక్షించే క్రమంలో బస్సు డ్రైవర్‌ని తప్పించి తానే స్వయంగా బస్సు నడిపారట.
అంతే కాకుండా రైలుకు ముందు వంద మంది విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా వివరించారు. గ్రాండ్ ట్రక్ ఎక్స్‌ప్రెస్ రైలును వంద మంది విద్యార్థులం నిలిపివేసి పెద్ద నిరసన వ్యక్తం చేశాం. ఆ సమయంలో నాతో సహా అందరిని పోలీసుల ఆరెస్ట్ చేసి గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి తీసుకువచ్చారు. అప్పుడు కరుణానిధి మాట్లాడుతూ మా నిరసనలకు పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటిస్తూనే మరోసారి రైలు రోకోలు చేయొద్దని అభ్యర్తించారని, నిరసనలని ఆపేసి బుద్దిగా కాలేజీలకు వెళ్లి చదువుకోవాలని సూచించారని, ఆ టైమ్‌లో నేను స్టూడెంట్ లీడర్‌గా ఉన్నానని తెలిపారు` అల్లు అరవింద్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
