Begin typing your search above and press return to search.

సంక్రాంతికి ఇంకెన్నీ సామీ..

తెలుగు సినిమాలకే రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ఆశించిన స్థాయిలో దొరకని పరిస్థితి ఉంది.

By:  Tupaki Desk   |   9 Nov 2023 4:12 AM GMT
సంక్రాంతికి ఇంకెన్నీ సామీ..
X

వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో టాలీవుడ్ నుంచి ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. వీటిలో ఒక్క నాగార్జున సినిమా తప్ప మిగిలినవన్నీ రావడం దాదాపు ఖరారు అయిపోయినట్లే. వీరిలో ఏ ఒక్కరు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, విక్టరీ వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జా హనుమాన్ మూవీస్ సంక్రాంతి రేసులో ఉన్నాయి.తమిళంలో శివ కార్తికేయన్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.

తెలుగు సినిమాలకే రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ఆశించిన స్థాయిలో దొరకని పరిస్థితి ఉంది. శివ కార్తికేయన్ మూవీ కూడా తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ కాబోతోంది. దానికి ఎక్కువగా థియేటర్స్ దొరికే అవకాశం అయితే ఉండదనే మాట వినిపిస్తోంది. అయితే ఇప్పుడు పొంగల్ రేసులో ధనుష్ పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ కూడా రిలీజ్ కాబోతోందని టాక్.

ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలుగులో సార్ మూవీతో ధనుష్ కొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. రఘువరన్ బీటెక్, తిరు లాంటి సినిమాలు తెలుగులో సక్సెస్ అయ్యాయి. కెప్టెన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ అయితే చేస్తున్నారు.

కాని అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చెప్పలేని పరిస్థితి. తెలుగు సినిమాలతోనే థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. కెప్టెన్ మిల్లర్ కి థియేటర్స్, మల్టీప్లెక్స్ లో స్క్రీన్స్ దొరకాలంటే మాత్రం కచ్చితంగా పెద్ద డిస్టిబ్యూటర్ చేతిలో పడాలి. సంక్రాంతి టైంలో ఇంత పోటీ మధ్య ఏరికోరి ఎవరైనా రిస్క్ చేసి కెప్టెన్ మిల్లర్ డబ్బింగ్ రిలీజ్ రైట్స్ కొనే అవకాశం ఉందా అనేది చూడాలి.

లియో సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ వారు కొనుగోలు చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా నిర్మాత నాగవంశీకి లాభాలు అయితే తీసుకొచ్చింది. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ లాంటి బడా నిర్మాణ సంస్థలు ఏమైనా కెప్టెన్ మిల్లర్ తెలుగు రాష్ట్రాల రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకొని రిలీజ్ చేస్తేనే కొద్దిగానైన థియేటర్స్ దొరికే అవకాశం ఉంటుంది.