Begin typing your search above and press return to search.

అన్ని సినిమాలు పుష్ప కాలేవు..?

అయితే పుష్ప రిలీజ్ తర్వాత క్యారెక్టరైజేషన్ అలా స్ట్రాంగ్ గా రాసుకుని సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు కొందరు మేకర్స్.

By:  Tupaki Desk   |   23 March 2024 12:30 AM GMT
అన్ని సినిమాలు పుష్ప కాలేవు..?
X

పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప చేసిన హంగామా అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సౌత్ ఆడియన్స్ కు మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది. ముఖ్యంగా పుష్ప రాజ్ యాటిట్యూడ్ పిచ్చెక్కిపోయింది. అందుకే నేషనల్ వైడ్ గా పుష్ప రాజ్ స్టైల్, డ్యాన్స్, డైలాగ్స్ ఇవన్నీ కూడా వైరల్ గా మారాయి. అయితే పుష్ప రిలీజ్ తర్వాత క్యారెక్టరైజేషన్ అలా స్ట్రాంగ్ గా రాసుకుని సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు కొందరు మేకర్స్.

ప్రేక్షకులను మెప్పించే సరికొత్త క్యారెక్టరైజేషన్ తో సినిమా చేస్తే సినిమాలు వర్క్ అవుట్ అవుతాయి. కానీ దానికి కథలో కూడా కొత్తదనం ఉండాలి. క్యారెక్టర్ కొత్తగా రాసుకుని రొటీన్ కథ చెప్పినా ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయరు. అందుకే కొత్త క్యారెక్టరైజేషన్ తో పాటుగా కొత్త కథ కూడా సినిమాకు చాలా ముఖ్యం.

పుష్ప పాన్ ఇండియా హిట్ అయ్యేసరికి అలాంటి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తోనే పాన్ ఇండియా అటెంప్ట్ చేయాలని కొందరు చూస్తున్నారు. కానీ క్యారెక్టరైజేషన్ ఎంత ముఖ్యమో ప్రేక్షకులను అలరించే కథ కథనాలు కూడా అంతే ముఖ్యమని వారు గుర్తించాలి. జస్ట్ హీరో క్యారెక్టర్ ఒక్కటి బాగా రాసుకుని సినిమా చేస్తా అంటే కుదిరే పరిస్థితి లేదు. అదీగాక ఈ మధ్య ప్రతి తెలుగు స్టార్ పాన్ ఇండియా సినిమా అనేసరికి పాన్ ఇండియా ఆడియన్స్ లో కూడా మన సినిమాల మీద ఆసక్తి తగ్గింది.

పాన్ ఇండియా రిలీజ్ అని హడావిడి బాగానే ఉన్నా ఆ రేంజ్ కంటెంట్ తో ఆడియన్స్ ని మెప్పించాల్సి ఉంటుంది. తెలుగులో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే వాటిలో కొన్ని డిఫరెంట్ స్టోరీస్ తో క్రేజీ అటెంప్ట్ చేస్తుంటే.. ఇలా క్యారెక్టరైజేషన్ తో కొత్తగా ట్రై చేస్తున్న వారు ఉన్నారు. అన్ని సినిమాలు పుష్ప కాలేవు కాబట్టి క్యారెక్టరైజేషన్ డ్రైవెన్ కథల విషయంలో మేకర్స్ ఇంకాస్త ఫోకస్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. అంతేకాదు ప్రతి పాన్ ఇండియా సినిమా మాస్ ఆడియన్స్ టార్గెట్ పెట్టుకున్నా వర్క్ అవుట్ అవ్వదని గమనించాలి. ఎందుకంటే నేషనల్ లెవెల్ లో సినిమా ఆడాలంటే కేవలం మాస్ మూవీస్ అయితేనే అని ఒక టాక్ నడుస్తుంది. కాబట్టి అలా కాకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా చూసుకోవాల్సిందే.