Begin typing your search above and press return to search.

బెంగ‌ళూరు మెగా ఫామ్‌హౌస్‌పైనే క‌ళ్ల‌న్నీ!

న‌గ‌రానికి సుదూరంగా ప్ర‌శాంతంగా అట‌వీ ప్రాంతంలో ఉన్న ఈ ఫామ్ హౌస్ సెల‌బ్రేష‌న్స్ ఇప్పుడు అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి.

By:  Tupaki Desk   |   18 Jan 2024 5:06 PM GMT
బెంగ‌ళూరు మెగా ఫామ్‌హౌస్‌పైనే క‌ళ్ల‌న్నీ!
X

బెంగ‌ళూరు ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబ‌రాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని ఎక‌రాల్లో ఉన్న సువిశాల‌మైన ఫామ్ హౌస్ లో మెగా - అల్లు కుటుంబాలు 2024 సంక్రాంతి పండుగ‌ను ఎంతో సంబ‌రంగా జ‌రుపుకున్నాయి. న‌గ‌రానికి సుదూరంగా ప్ర‌శాంతంగా అట‌వీ ప్రాంతంలో ఉన్న ఈ ఫామ్ హౌస్ సెల‌బ్రేష‌న్స్ ఇప్పుడు అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి.

ఇంత‌కీ ఈ ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది? ఎన్ని ఎక‌రాల్లో ఉంది? దీని ఖ‌రీదు ఎంత ఉంటుంది? అంటూ ఆరాలు మొద‌లెట్టారు. అయితే ఇది బెంగ‌ళూరు దేవ‌న‌హ‌ల్లి స‌మీపంలోని ఫారెస్ట్ ఏరియాలో ఉంది. గ్రీన్ సిటీ బెంగ‌ళూరు నుంచి సుమారు 30 కి.మీ ల దూరంలో ఉంటుంది. కెంపె గౌడ ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్ పోర్ట్ కు అత్యంత స‌మీపంలోనే ఉంటుంద‌ని స‌మాచారం. కొన్ని ఎక‌రాల్లో విస్త‌రించిన ఈ ఫామ్ హౌస్ ఖ‌రీదు దాదాపు 30 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది.

చాలా కాలం క్రితం ర‌జ‌నీకాంత్ ఇదే ఏరియాలో ఫామ్ హౌస్ కొనుక్కున్నార‌ని, ఆ ఫామ్ హౌస్ కి ఎదురుగానే మెగాస్టార్ చిరంజీవి ఫామ్ హౌస్ కూడా ఉంటుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. త‌ర‌చుగా ర‌జ‌నీ కూడా త‌న ఫామ్ హౌస్ ని విజిట్ చేస్తుంటారు. ఆ ఇద్ద‌రు టాప్ స్టార్ల‌తో పాటు ప‌లువురు తార‌ల‌కు ఇక్క‌డ ఫామ్ హౌస్ లు ఉన్నాయ‌ని కూడా చెబుతుంటారు. ఇండ‌స్ట్రీ సంపాద‌న నుంచి కొంత మొత్తాన్ని ఇక్క‌డ ఫామ్ హౌస్ ల‌పై పెట్టుబ‌డులుగా పెట్టార‌ని కూడా చెబుతారు. అయితే ఈ ఫామ్ హౌస్ ల త‌ర్వాత పూర్తిగా ద‌ట్ట‌మైన కీకార‌ణ్యం ఉంది. ఇక్క‌డ వ‌న్య మృగాలు స్వేచ్ఛగా సంచ‌రిస్తుంటాయని కూడా చెబుతున్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్ర‌ఫీకి కూడా ఇది అనుకూల ప్ర‌దేశంగా ప్ర‌చారం ఉంది.

ఈసారి బెంగ‌ళూర్ ఫామ్ హౌస్ పార్టీలో చిరంజీవి, నాగ‌బాబు, అల్లు అర‌వింద్ స‌హా వారి కుటుంబ స‌భ్యులంతా పాల్గొన్నారు. వ‌రుణ్ తేజ్ - లావ‌ణ్య త్రిపాఠి జంట కూడా ఇక్క‌డ సంబ‌రాలు జ‌రుపుకున్నారు. వ‌దిన‌మ్మ లావ‌ణ్య‌తో నిహారిక కొణిదెల ఎంతో జాలీగా గ‌డుపుతున్న ఫోటోలు వీడియోలు కూడా ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న‌, బ‌న్ని - స్నేహ జంట‌ల‌తో పాటు బ్యాచిల‌ర్స్ సాయి ధ‌ర‌మ్ తేజ్,, వైష్ణ‌వ్ తేజ్, అల్లు శిరీష్‌ త‌దిత‌రులు ఈ ఫెస్టివ‌ల్ లో పాల్గొన్నారు.