Begin typing your search above and press return to search.

నా సామి రంగ అల్లరోడి ట్విస్ట్‌ అదుర్స్‌..!

కథలో అల్లరి నరేష్ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని, ముఖ్యంగా నరేష్ పాత్ర ట్విస్ట్‌ కు ప్రేక్షకుల మైండ్‌ పోతుందని యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 5:30 PM GMT
నా సామి రంగ అల్లరోడి ట్విస్ట్‌ అదుర్స్‌..!
X

సంక్రాంతి సందర్భంగా విడుదల అవ్వబోతున్న సినిమా ల్లో నా సామి రంగ సినిమా ఒకటి అనే విషయం తెల్సిందే. నాగార్జున హీరోగా ఆశికా రంగనాథ్‌ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. సంక్రాంతి కి అసలైన పండుగ సినిమా అన్నట్లుగా ఈ సినిమా పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్‌, రాజ్ తరుణ్ లు కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో అల్లరి నరేష్ పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కథలో అల్లరి నరేష్ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని, ముఖ్యంగా నరేష్ పాత్ర ట్విస్ట్‌ కు ప్రేక్షకుల మైండ్‌ పోతుందని యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. అల్లరి నరేష్ పాత్ర ను సినిమాలో చూసి షాక్ అవుతారని కూడా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. జనవరి 14న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అసలైన సంక్రాంతి సినిమా అన్నట్లుగా అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ సినిమా లతో పాటు ఈ సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే.