Begin typing your search above and press return to search.

రిలీజ్ ఎప్పుడు భయ్యా... ఆ ఒక్కటి అడక్కు

హీరోగా వద్దు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేయాలి అనుకున్న సమయంలో నాంది సినిమాలో నటించి హిట్ కొట్టాడు.

By:  Tupaki Desk   |   11 April 2024 7:32 AM GMT
రిలీజ్ ఎప్పుడు భయ్యా... ఆ ఒక్కటి అడక్కు
X

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి, మినిమం గ్యారెంటీ హీరో అంటూ పేరు దక్కించుకున్న అల్లరి నరేష్‌ గత కొన్నాళ్లుగా కెరీర్ పరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆ మధ్య అల్లరోడికి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడ్డాయి. అయినా కూడా నిరాశ చెందకుండా కెరీర్ లో ముందుకు సాగాడు.

హీరోగా వద్దు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేయాలి అనుకున్న సమయంలో నాంది సినిమాలో నటించి హిట్ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తన మార్క్‌ కామెడీ ఎంటర్‌ టైనర్ తో అల్లరి నరేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అదే 'ఆ ఒక్కటి అడక్కు'.

ఈవీవీ సూపర్‌ హిట్‌ మూవీ అయిన ఆ ఒక్కటి అడక్కు టైటిల్ తో అల్లరోడి సినిమా అనగానే అందరిలో కూడా ఆసక్తి మొదలైంది. సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అవుతుంది. గత నెలలోనే సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు.

ఈ నెలలో వరుసగా సినిమాలు ఉండటం వల్ల రిలీజ్ విషయంలో అల్లరోడి టీం కాస్త గందరగోళం లో పడ్డట్లుగా తెలుస్తోంది. రిలీజ్‌ విషయంలో ఆ ఒక్కటి అడక్కు మేకర్స్‌ నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఏప్రిల్‌ 5న రావాలని భావించినా కూడా ఫ్యామిలీ స్టార్‌ కి భయపడి రాలేదు.

ఏప్రిల్‌ చివరి వారం లో రావాలి అనుకుంటే పలు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మే లో ఎన్నికల హడావుడి జూన్ మరియు జులై లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవ్వడం లేదు. అందుకే ఆ ఒక్కటి అడక్కు రిలీజ్ డేట్‌ ఎప్పుడు అంటే ఆ ఒక్కటి అడక్కు అంటూ మేకర్స్ రిలీజ్ డేట్‌ విషయంలో నీళ్లు నములుతున్నారు. కంటెంట్‌ ఉన్న సినిమా కనుక కాస్త మంచి తేదీకి వస్తే మంచి వసూళ్లు నమోదు అవుతాయి అంటూ మేకర్స్ భావిస్తున్నారు.