Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్.. ఈసారి బచ్చల మల్లి

హీరో అల్లరి నరేష్ కమెడి హీరోగా ఎంతగా గుర్తింపు అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   1 Dec 2023 6:43 AM GMT
అల్లరి నరేష్.. ఈసారి బచ్చల మల్లి
X

హీరో అల్లరి నరేష్ కమెడి హీరోగా ఎంతగా గుర్తింపు అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అప్పుడప్పుడు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తున్న నరేష్ ఇప్పుడైతే అంచనాలకు భిన్నంగా డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక అతని నుంచి రాబోయే 63 వ సినిమా కూడా మరింత విభిన్నంగా ఉండబోతున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను విడుదల చేసుజరు.


సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో నరేష్ కొత్త సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా మరియు బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. ఏకంఈ రోజు, మేకర్స్ #N63 టైటిల్‌ను ప్రకటించారు. దీనికి బచ్చల మల్లి అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.

టైటిల్ పోస్టర్‌లో పూర్తిగా లోడ్ చేయబడిన ట్రాక్టర్ లోయలో పడిపోతున్నట్లు కనిపిస్తోంది. ట్రాక్టర్‌పై టైటిల్ రాసి ఉంది. ఇక టైటిల్ పోస్టర్ ద్వారా సినిమాలో యాక్షన్‌ డోస్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా ఇది కొత్త తరహా యాక్షన్ డ్రామాగా రూపొందించబడినట్లు తెలుస్తోంది.

ఇందులో అల్లరి నరేష్ ఇంటెన్సివ్ రోల్ ప్లే చేయబోతున్నాడట. అతను పూర్తిగా కొత్త లుక్ లో కనిపించనున్నాడని చెబుతున్నారు. ఇక సినిమా 1990 బ్యాక్ డ్రాప్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట జయరామ్, రావు రమేష్, సాయి కుమార్, ధనరాజ్, హరితేజ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

భారీ స్థాయిలో రూపొందనున్న బచ్చల మల్లి సినిమాకు సీతా రామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. ఇక రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమాతో అల్లరి నరేష్ ఏ స్థాయిలో గుర్తింపు అందుకుంటాడో చూడాలి. అలాగే అల్లరి నరేష్ మరో కొత్త సినిమాపై కూడా త్వరలోనే ఒక క్లారటీ ఇవ్వనున్నట్లు సమాచారం.