Begin typing your search above and press return to search.

పీరియాడిక్‌ అల్లరి కి ఏర్పాట్లు..!

ఈ మధ్య కాలంలో పీరియాడిక్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతోంది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 2:45 AM GMT
పీరియాడిక్‌ అల్లరి కి ఏర్పాట్లు..!
X

ఈ మధ్య కాలంలో పీరియాడిక్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతోంది. ప్రేక్షకులను కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్లడం ద్వారా అలరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ కు తగ్గట్లుగా అల్లరి నరేష్ తన సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. అందులో భాగంగానే తదుపరి సినిమా పీరియాడిక్ నేపథ్యంలో ఉండబోతుందట.

సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఊరు పేరు భైరవకోన ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా నిర్మాత రాజేష్ దండా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ బ్యానర్ లో రాబోతున్న సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ... మా బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమా విభిన్నమైన జానర్ లో రాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. మొదట సోషల్ డ్రామా, ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ను తీసుకు వచ్చాం. ఇప్పుడు సందీప్‌ కిషన్ తో నిర్మించిన ఊరు పేరు భైరవకోన చిత్రం సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌.

తమ బ్యానర్ లో త్వరలో అల్లరి నరేష్ తో ఒక పీరియాడిక్ సినిమాను నిర్మించబోతున్నాం. అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. అల్లరి నరేష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గ మంచి పీరియాడిక్ డ్రామా తో సినిమాను రూపొందించబోతున్నామని ఆయన పేర్కొన్నాడు.

ఒకప్పుడు కామెడీ సినిమాలు మాత్రమే చేసిన అల్లరోడు ఇప్పుడు సీరియస్ సినిమాలు చేస్తూ ఉన్నాడు. నాంధి తో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా మరిన్ని సీరియస్ సినిమాలు చేయాలని అల్లరి నరేష్ ఫిక్స్ అయ్యాడు. మరి పీరియాడిక్ కథ తో అల్లరోడు మెప్పించేనా చూడాలి.