Begin typing your search above and press return to search.

అల్లరోడి 'ఆ' టైటిల్... గందరగోళం

అల్లరి నరేష్ నా సామి రంగ సినిమా తో సంక్రాంతి సందర్భంగా నాగార్జునతో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   29 Jan 2024 7:30 AM GMT
అల్లరోడి ఆ టైటిల్... గందరగోళం
X

అల్లరి నరేష్ నా సామి రంగ సినిమా తో సంక్రాంతి సందర్భంగా నాగార్జునతో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కమర్షియల్ గా విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక వైపు ఇతర హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేసేందుకు కథలు వింటున్నాడు.

ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్‌ నుంచి ఎక్కువగా సీరియస్ కథలు, సీరియస్ పాత్రలు వచ్చాయి. చాలా రోజుల తర్వాత కామెడీ సోలో హీరో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకు గాను తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ సూపర్‌ హిట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు టైటిల్ ను పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఆ మధ్య 'ఆ ఒక్కటి అడక్కు' టైటిల్ తో ఒక సినిమా ప్రారంభం అయ్యింది. రామ్‌ అంకం దర్శకత్వంలో సినిమా రూపొందింది. షూటింగ్‌ పూర్తి అయ్యిందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ అల్లరోడి సినిమా, దానికి ఆ ఒక్కటి అడక్కు అంటూ టైటిల్ ను పెట్టే ఆలోచనలో ఉన్నారు అంటూ వార్తలు రావడం గందరగోళంను క్రియేట్‌ చేస్తోంది.

ఈ మధ్య కాలంలో సోలో హీరోగా అల్లరి నరేష్‌ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు దక్కడం లేదు. దాంతో ఈ టైటిల్ తో కచ్చితంగా ప్రయత్నిస్తే విజయం సాధించడం ఖాయం అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ టైటిల్‌ కి కచ్చితంగా నరేష్‌ పూర్తి న్యాయం చేస్తాడు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఈ గందరగోళం కు క్లారిటీ వచ్చేది ఎప్పుడో చూడాలి.