Begin typing your search above and press return to search.

అల్ల‌రి న‌రేష్ కు గ్యాప్ భారీగా!

ఏ హీరో సినిమా రిలీజ్ అయినా అవ్వ‌క‌పోయినా న‌రేష్ సినిమా మాత్రం సీజ‌న్ తో ప‌నిలేకుండా రిలీజ్ అయ్యేది

By:  Tupaki Desk   |   2 July 2025 6:00 AM IST
అల్ల‌రి న‌రేష్ కు గ్యాప్ భారీగా!
X

అల్ల‌రి న‌రేష్ ఒక‌ప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలతోనై ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో ఉండేవాడు. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా అవ్వ‌క‌పోయినా న‌రేష్ సినిమా మాత్రం సీజ‌న్ తో ప‌నిలేకుండా రిలీజ్ అయ్యేది. కొన్ని సార్లు పండ‌గ సీజ‌న్లు కూడా క‌వ‌ర్ చేసేది. అలా ప‌నిచేసాడు కాబ‌ట్టే 20 ఏళ్ల కెరీర్ లో 50కి పైగా సినిమాలు చేయ‌గ లిగాడు. కానీ కొంత కాలంగా ఆ ప‌రిస్థితి లేదు. `నాంది` సినిమా నుంచి న‌రేష్ ట్రాక్ మారిపోయింది.

కామెడీ జాన‌ర్ని వ‌దిలేసి కొత్త ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. ఇత‌ర స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించ‌డం లేదంటే? తానే యాక్ష‌న్ స్టార్ బ‌రిలోకి దిగ‌డం వంటివి జ‌రుగుతున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో న‌రేష్ ఐదారు సినిమాలే చేసాడు. అంటే నరేష్ కెరీర్ గ్రాఫ్ ఎంత‌గా ప‌డిపోయిందో అర్దం చేసుకోవ‌చ్చు. `బంగారు బుల్లోడు`, `నాంది`, `ఇట్లు మారేడిమిల్లు ప్ర‌జానికం`, `ఉగ్రం`, `నాసామీరంగ‌`, `ఆ ఒక్క‌టి అడ‌క్కు`, `బ‌చ్చ‌ల‌మ‌ల్లి` చిత్రాలు చేసాడు.

వీటిలో `నా సామిరంగ` ఆడింది. మిగిలిన సినిమాలేవి సరిగ్గా ఆడ‌లేదు. అలాగే ఈ చిత్రాల్లో మూడు సినిమాలు గ‌త ఏడాదే రిలీజ్ అయ్యాయి. 2025 లో మాత్రం బోణీ కొట్ట‌లేదు. ఇప్ప‌టికే స‌గం ఏడాది పూర్త యింది. చేతిలో ఉన్న సినిమా చూస్తే ఒక్క‌టే క‌నిపిస్తుంది. అదే `స‌భ‌కు న‌మ‌స్కారం`. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. కానీ అప్ డేట్ లేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ‌దు.

దీంతో న‌రేష్ సినిమా రిలీజ్ ల‌కు మ‌రోసారి గ్యాప్ త‌ప్పేలా లేదు. న‌రేష్ కామెడీ జ‌నార్ ని వ‌దిలేసిన ద‌గ్గ‌ర నుంచి ఈ స‌మ‌స్య త‌లెత్తింది. కామెడీ సినిమాలు చేసినంత కాలం తిరుగులేకుండా సాగాడు. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు లేక‌పోయినా న‌రేష్ సినిమా లతో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడేవి. ఆ ర‌కంగా థియేట‌ర్లో కొంత ఆక్యుపెన్సీ క‌నిపించేది. న‌రేష్ సినిమాలు చేయ క‌పోడం కూడా ఇండ‌స్ట్రీకి న‌ష్టంగా మారింది.