ఆ హీరోకి మిగిలింది 'ఆల్కహాల్' మాత్రమేనా..?
రెండు దశాబ్దాల కెరీర్ లో తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన అల్లరి నరేష్ రొటీన్ కామెడీ వర్క్ అవుట్ అవ్వట్లేదని గుర్తించి కాస్త కొత్తగా ట్రై చేయాలని సీరియస్ రోల్స్ కి నాందితో నాంది పలికాడు.
By: Tupaki Desk | 29 Nov 2025 5:58 PM ISTరెండు దశాబ్దాల కెరీర్ లో తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన అల్లరి నరేష్ రొటీన్ కామెడీ వర్క్ అవుట్ అవ్వట్లేదని గుర్తించి కాస్త కొత్తగా ట్రై చేయాలని సీరియస్ రోల్స్ కి నాందితో నాంది పలికాడు. ఐతే ఆ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అదే పంథాలో కొన్ని సినిమాలు తీశాడు. ఐతే మధ్యలో ఒకటి అర తన కామెడీ మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు కానీ ఇవేవి వర్క్ అవుట్ కాలేదు. నాంది తర్వాత అరడజను సినిమాల దాకా చేసిన అల్లరి నరేష్ కి రిజల్ట్ షాక్ ఇచ్చింది. రీసెంట్ గా వచ్చిన 12 A రైల్వే కాలనీ కూడా డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది.
ఆలోచనలో పడ్డ అల్లరి నరేష్..
ఐతే ఈ రిజల్ట్ తో అల్లరి నరేష్ ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ ఆల్కహాల్ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ ఈ సినిమా నిర్మించారు. మెహర్ తేజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా సత్య ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని 2026 జనవరి 1న లాక్ చేశారు. ఐతే ఆల్కహాల్ సినిమా అనుకున్న డేట్ కి రావడం కష్టమే టాక్ వినిపిస్తుంది.
12 A రైల్వే కాలనీ సినిమా పై ఆడియన్స్ అసలేమాత్రం ఆసక్తి చూపించలేదు. సినిమాకు అల్లరి నరేష్ బాగానే ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చినా ఆడియన్స్ అసలు పట్టించుకోలేదు. అందుకే ఈ టైంలో ఆల్కాల్ రిలీజ్ రిస్క్ అని భావిస్తున్నారట మేకర్స్. అందుకే ఆల్కహాల్ ని జనవరి 1 నుంచి పోస్ట్ పోన్ ప్లానింగ్ ఉందట. ఆల్కహాల్ సినిమా వాయిదాకు మరో రీజన్ డిసెంబర్ 25న అంటే ఐదు రోజుల ముందు సినిమాల రిలీజ్ లు ఉన్నాయి.. అదీగాక సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలు చాలా వస్తున్నాయి. సో ఎలా లేదన్నా ముందు వెనక గట్టి పోటీ ఉంది.
ఆడియన్స్ మూడ్ అంతా సంక్రాంతి సినిమాల కోసమే..
జనవరి 1న రిలీజైన ఆడియన్స్ మూడ్ అంతా సంక్రాంతి సినిమాల కోసమే అన్నట్టు ఉంటుంది. అందుకే జనవరి వదిలి నెక్స్ట్ ఒక మంచి సోలో రిలీజ్ డేట్ చూడాలని సితార నాగ వంశీ చూస్తున్నారట. ఐతే అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆల్కహాల్ పోస్ట్ పోన్ పై ఆల్రెడీ డిస్కషన్స్ మొదలయ్యాయట. మరి ఆ డేట్ ఎప్పుడన్నది త్వరలో తెలుస్తుంది. మరి ఆల్కహాల్ తో అయినా అల్లరి నరేష్ కి హిట్ దక్కుతుందేమో చూడాలి.
సితార బ్యానర్ సినిమా అందులోనూ ఆల్కహాల్ టీజర్ ఇంప్రెస్ చేసింది కాబట్టి కచ్చితంగా అల్లరి నరేష్ కి ఈ సినిమా ఒక కొత్త ఉత్సాహం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి మంచి సక్సెస్ కంబ్యాక్ కోసం చూస్తున్న అల్లరోడికి ఆల్కహాల్ ఆ సక్సెస్ కిక్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.
