Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్ 'ఆల్కహాల్'.. ఫస్ట్ లుక్ కిక్కిచ్చేలా..

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. కామెడీ సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో వేరే లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 11:56 AM IST
అల్లరి నరేష్ ఆల్కహాల్.. ఫస్ట్ లుక్ కిక్కిచ్చేలా..
X

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. కామెడీ సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో వేరే లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే కొంతకాలం క్రితం తన స్టైల్ మార్చేశారు. రొటీన్ కథలను పక్కన బెట్టి సీరియస్ మూవీలు చేస్తున్నారు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథలతో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తున్నారు.


సాలిడ్ కంటెంట్ ఉన్న చిత్రాల్లో యాక్ట్ చేస్తున్న అల్లరి నరేష్.. ఇప్పుడు 63వ మూవీతో బిజీగా ఉన్నారు. ఫ్యామిలీ డ్రామా ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నేడు అల్లరి న‌రేష్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ టైటిల్ ను రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం నరేష్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"విభిన్నమైన రీతిలో మునిగిపోతున్నారు... మన హీరో అల్లరి నరేష్.. ప్రత్యేక రోజున ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతారంలో ప్రదర్శిస్తున్నాం. మన ప్రియమైన అల్లరి నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆల్కహల్ అతి త్వరలో మిమ్మల్ని పూర్తిగా ఆవహిస్తుంది" అంటూ మేకర్స్.. ఫస్ట్ లుక్ ను రివీల్ చేయగా.. నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

అయితే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌ లో నరేష్ ఆల్కహాలిజంలో పూర్తిగా మునిగిపోయినట్టుగా కనిపిస్తున్నారు. సినిమా భ్రమ, వాస్తవికత మధ్య నడిచే కథతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫస్ట్ లుక్ అదిరిపోయిందని.. కిక్కిచ్చేలా ఉందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. వెయిటింగ్ ఆఫర్ మూవీ అని చెబుతున్నారు.

ఇక ఆల్కాహల్ మూవీ విషయానికొస్తే.. రుహనీ శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో నరేష్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.