Begin typing your search above and press return to search.

తేజా సజ్జా మిరాయ్ ఏమైంది..?

మిరాయ్ సినిమా ఏప్రిల్ రిలీజ్ అన్నారు. సినిమా వస్తుందా రాదా అన్న క్లారిటీ ఇవ్వలేదు సరికదా అసలు ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు.

By:  Tupaki Desk   |   11 May 2025 7:30 AM
తేజా సజ్జా మిరాయ్ ఏమైంది..?
X

చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన తేజా సజ్జా సమంత నటించిన ఓ బేబీ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఇక ఆ తర్వాత జాంబి రెడ్డితో సక్సెస్ అందుకున్నాడు. మళ్లీ ప్రశాంత్ వర్మతోనే హనుమాన్ సినిమా తీసి పాన్ ఇండియా హిట్ కొట్టాడు. హనుమాన్ సినిమా సక్సెస్ తేజా సజ్జాని సూపర్ పాపులర్ అయ్యేలా చేసింది. హనుమాన్ ఇచ్చిన పుష్ తో తేజా సజ్జా కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తేజా సజ్జా మిరాయ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన మిరాయ్ సినిమాను అసలైతే ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్న టైం కి సినిమాను తీసుకు రాలేకపోయారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలన్నీ ఈమధ్య ఎందుకో రిలీజ్ ల విషయంలో క్లారిటీ మిస్ అవుతున్నాయి. దాని వల్ల సినిమాపై ఆడియన్స్ కి ఉన్న ఇంట్రెస్ట్ కాస్త తగ్గుతుంది.

మిరాయ్ సినిమా ఏప్రిల్ రిలీజ్ అన్నారు. సినిమా వస్తుందా రాదా అన్న క్లారిటీ ఇవ్వలేదు సరికదా అసలు ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. అసలు మిరాయ్ ఎక్కడిదాకా వచ్చింది. సినిమా రిలీజ్ ఎప్పుడు అంటూ ఆడియన్స్ అడుగుతున్నారు. మిరాయ్ మేకర్స్ నుంచి మాత్రం దేనికి సరైన సమాధానం రావట్లేదు. మిరాయ్ సినిమా లో తేజా సజ్జా తో పాటు మంచు మనోజ్ కూడా నటిస్తున్నాడు.

సినిమాలో మనోజ్ విలన్ గా చేస్తున్నాడని తెలుస్తుంది. మంచు మనోజ్ కంబ్యాక్ గా ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండనుంది. ఐతే మిరాయ్ తర్వాత ఓకే చేసిన భైరవం ఈ నెల చివరన రిలీజ్ అవుతుంది. సో మంచు మనోజ్ ముందు భైరవం ఆ తర్వాత మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తేజా సజ్జా, మంచు మనోజ్ ఫైట్ ఎలా ఉంటుందో అని ఆడియన్స్ అంతా ఆసక్తికరంగా ఉన్నారు. అంతేకాదు మిరాయ్ కాన్సెప్ట్ టీజర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బేటర్ అని చెప్పొచ్చు. తేజా సజ్జా ఈ సినిమాతో పాటు జై హనుమాన్ లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయి.