Begin typing your search above and press return to search.

ఆలియా పెళ్లిరోజు కానుక టూమ‌చ్ కాస్ట్‌లీ గురూ

అందుకే ఆలియా ఏం చేసినా.. ప్ర‌తిదీ ఇటు సౌత్ లోను సంచ‌ల‌న‌మే.

By:  Tupaki Desk   |   7 April 2024 11:25 AM GMT
ఆలియా పెళ్లిరోజు కానుక టూమ‌చ్ కాస్ట్‌లీ గురూ
X

ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో సౌత్ కి ప‌రిచ‌య‌మైంది ఆలియా భ‌ట్. ఉత్త‌రాది ద‌క్షిణాది రెండు చోట్లా త‌న‌కు ఇప్పుడు భారీ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అందుకే ఆలియా ఏం చేసినా.. ప్ర‌తిదీ ఇటు సౌత్ లోను సంచ‌ల‌న‌మే. ఇప్పుడు ఏకంగా 8 కోట్ల విలువైన‌ పెళ్లిరోజు కానుక‌ను అందుకుంది. అంత ఖ‌రీదైన కానుక ఏమై ఉంటుంది.. గెస్ చేయ‌గ‌ల‌రా?

ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న బెంట్లీ కార్. త‌న భ‌ర్త రణబీర్ కపూర్ ఆలియాకు రూ. 8 కోట్ల విలువైన కొత్త బెంట్లీ కాంటినెంటల్‌ను బహుమతిగా ఇచ్చాడు. బ్లాక్ బ్యూటీ అనేది ఈ కార్ పేరు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న‌ హై-ఎండ్ విలాసవంతమైన కార్లు తమ గ్యారేజీలో ఉన్నా ఈ ఖ‌రీదైన కార్ ని భార్య‌కు అత‌డు బ‌హుమతిగా ఇచ్చి ప్రేమ‌ను చాటుకున్నాడు. గ‌త ఏడాది.. తన కార్ కలెక్షన్‌కు బెల్‌గ్రేవియా గ్రీన్ ఎక్స్‌టీరియర్స్‌తో కూడిన రేంజ్ రోవర్‌ను ర‌ణ‌బీర్ జోడించాడు.

ఇప్పుడు త‌న భార్య ఆలియా కోసం బెంట్లీ కార్ కొన్నాడు. ఈ కొత్త‌ కార్ రైడ్‌లో కెమెరాల‌కు చిక్కాడు. ముంబైలోని నూతన వధూవరులు రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నాని ఇచ్చిన పార్టీకి ఈ కొత్త కార్ లో అటెండ‌య్యారు. అలియా భట్ ఎరుపు రంగు దుస్తులలో అందంగా కనిపించగా, రణబీర్ కపూర్ క్లాసీ బ్లాక్ షర్ట్‌లో ఎప్పటిలాగే అందంగా కనిపించాడు. ఈ జంట కెమెరాలకు ఫోజులిచ్చారు. కొత్త కార్ ని కొన‌డ‌మే కాదు.. ముంబైలో ఈ జంట రూ.200 కోట్ల విలువైన కొత్త ఇంటిని నిర్మిస్తూ నిరంత‌రం హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. ఇటీవ‌లే ఈ ఇంటిని రాహా క‌పూర్ కి కానుక‌గా రాసిచ్చారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... రణబీర్ కపూర్ తదుపరి `రామాయణం`లో న‌టించాల్సి ఉంది. అలాగే సందీప్ వంగాతో `యానిమల్ పార్క్` 2025లో సెట్స్ కెళ్లే వీలుంది. అలియా భట్ తదుపరి చిత్రం జిగ్రాతో అభిమానుల ముందుకు రానుంది. ఆలియా-ర‌ణ‌బీర్ న‌టించాల్సిన `బ్ర‌హ్మాస్త్ర 2` పై ఎలాంటి స‌మాచారం లేదు.