Begin typing your search above and press return to search.

క్యూరియ‌స్.. ఆలియాతో కొత్త కుర్రాడు?

వేదికపై ఆలియా రూపం ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. బంగారు నెక్లెస్ జోడించిన‌ సొగసైన నల్లటి ప్యాంట్‌సూట్‌లో బాస్ లేడీ వైబ్స్‌తో ఆలియా మురిపించింది.

By:  Tupaki Desk   |   6 March 2024 4:02 PM GMT
క్యూరియ‌స్.. ఆలియాతో కొత్త కుర్రాడు?
X

ఒక జాతీయ ఉత్త‌మ న‌టి.. ఒక డెబ్యూ హీరో క‌ల‌యిక‌లో సినిమా అన‌గానే స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంటుంది. ఇప్పుడు అలాంటి ఆస‌క్తి ఈ ప్రాజెక్ట్ పై ఉంది. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే ఆ ఇద్ద‌రూ క‌లిసి ప‌బ్లిక్ వేదిక‌ల‌పై త‌ళుక్కుమంటూ హీట్ పెంచేస్తున్నారు.. వివ‌రాల్లోకి వెళితే....

ఆలియా భట్ తన త‌దుప‌రి చిత్రం 'జిగ్రా' చిత్రీకరణను పూర్తి చేసింది, ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌లో ది ఆర్చీస్‌తో తన నటనా రంగ ప్రవేశం చేసిన వేదాంగ్ రైనాతో కలిసి అలియా కనిపించనుంది. ఈ క‌ల‌యిక‌లో మొద‌టి చిత్ర‌మిది. వీరిద్దరూ ఇటీవల ఒక ఈవెంట్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారారు. ఇద్ద‌రూ క‌లిసి కార్యక్రమంలో కలిసి స్టైలిష్ పోజ్ ఇచ్చారు.

వేదికపై ఆలియా రూపం ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. బంగారు నెక్లెస్ జోడించిన‌ సొగసైన నల్లటి ప్యాంట్‌సూట్‌లో బాస్ లేడీ వైబ్స్‌తో ఆలియా మురిపించింది. వదులుగా ఫ్రీ అండ్ ఫ్లో హెయిర్- స్మోకీ ఐ మేకప్‌తో మ‌తులు చెడ‌గొట్టింది. జోయా అక్తర్ 'ది ఆర్చీస్‌'లో రెగ్గీ మాంటిల్ పాత్రతో పాపుల‌రైన వేదంగ్ రైనా, జిగ్రా స‌హ‌న‌టి ఆలియా కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. వేదాంగ్ నల్లటి ప్యాంటు వైట్ షర్ట్‌లో అందంగా కనిపించాడు. ఈ జంట ఫోటోల‌ను సెలబ్రిటీ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి.

నిజానికి ఆలియా -వేదంగ్ ఇద్దరూ గత వారాంతంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కనిపించారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ వేడుకల్లో ఈ ఇద్ద‌రూ సంద‌డి చేసారు. ఈ కార్యక్రమానికి అలియా తన భర్త రణబీర్ కపూర్‌తో పాటు వారి కుమార్తె రాహా , రణబీర్ తల్లి నీతూ కపూర్‌తో కలిసి హాజరయ్యారు. ఇంతలో వేదాంగ్ తన స్నేహితురాలు ఖుషీ కపూర్‌తో కలిసి కనిపించాడు.

జిగ్రా గురించి మరింత సమాచారం

గత నెలలో సింగపూర్‌లో జిగ్రా సినిమా చిత్రీకరణను టీమ్ ముగించింది. ఈ సందర్భంగా సెట్స్ నుండి షేర్ చేసిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జైలు బ్రేక్ థ్రిల్లర్ అంటూ ప్రచారం సాగుతోంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ - అలియా భట్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం యువ‌త‌రానికి ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. జిగ్రా 27 సెప్టెంబర్ 2024న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది.