Begin typing your search above and press return to search.

బిగ్గెస్ట్ స్పై వరల్డ్ లో అలియా.. బంపరాఫర్

వచ్చినవే. తాజాగా అలియా భట్ తో కూడా అదే సంస్థ ఓ స్పై మూవీ తెరకెక్కించాలని అనుకోవడం విశేషం.

By:  Tupaki Desk   |   14 July 2023 7:13 AM GMT
బిగ్గెస్ట్ స్పై వరల్డ్ లో అలియా.. బంపరాఫర్
X

ఇప్పటి వరకు మీరు చాలా స్పై మూవీలు చూసి ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ ఇవన్నీ అలాంటి సినిమాలే. హీరోలు స్పైగా పని చేసి శత్రుమూకల ను అంతం చేస్తూ ఉంటారు. కాగా, ఇప్పుడు ఈ స్పై యూనివర్స్ లోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ కూడా అడుగుపెడుతోంది.

ఇప్పటి వరకు పైన చెప్పిన స్పై మూవీలన్నీ యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చినవే. తాజాగా అలియా భట్ తో కూడా అదే సంస్థ ఓ స్పై మూవీ తెరకెక్కించాలని అనుకోవడం విశేషం.అలియా ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను తెరకెక్కించాలని అనుకుంటున్నారట. 2024లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న స్పై జోనర్ లో ఇది ఎనిమిదవ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉంది.

ఇటీవల వీరు పఠాన్ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా టైగర్ 3 మూవీ ఈ ఏఢాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది విడుదలవ్వ గానే హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వాణిలు ప్రధాన పాత్రలతో వార్ 2 మూవీ నవంబర్ లో సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

మరో వైపు టైగర్ vs పఠాన్ కూడా తెరరకెక్కించాలని అనుకుంటన్నారు. ఇది కూడా ఈ ఏడాదే షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే వారి మధ్య సీన్స్ భారీ గా ఉండెందుకు సంబంధించిన సెట్స్ కూడా డిజైన్ చేస్తున్నారు. ఈ లైన్ లో ఉన్న ఈ సినిమాలన్నీ పూర్తైన తర్వాత అలియాభట్ తో మూవీ ని మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా, ఈ మూవీ లో అలియా సరికొత్త అవతార్‌ లో కనిపించనుందని తెలుస్తోంది. ఈ సిరీస్ కి ఇంకా పేరు కూడా ఖరారు చేయలేదు. కానీ, అలియా భట్ క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు లేడీ స్పై మూవీ రాలేదు కాబట్టి, అలియా క్యారెక్టర్ బెస్ట్ గా ఉండాల ని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా, రాబోయే రెండేళ్లలో యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి నాలుగు సినిమాలు వస్తుండటం విశేషం.