Begin typing your search above and press return to search.

నెపో కిడ్ అని పిలిస్తే ఆలియాకు న‌చ్చ‌దా?

అయితే తాజా ఇంట‌ర్వ్యూలో ఆలియా నెపోటిజం గురించి ప్ర‌స్థావించింది. అలాగే తన తల్లి సోని ర‌జ్దాన్ నటిగా ఎదిగేందుకు ఎలా కష్టపడిందో కూడా రివీల్ చేసింది.

By:  Tupaki Desk   |   23 Sep 2023 12:30 AM GMT
నెపో కిడ్ అని పిలిస్తే ఆలియాకు న‌చ్చ‌దా?
X

ఒక న‌టిగా ఆలియా భట్ చాలా ఎత్తుల‌కు ఎదిగింది. వినోద పరిశ్రమలో అత్యంత ఆద‌ర‌ణ ఉన్న మేటి నాయిక‌గా కీర్తినందుకుంది. గొప్ప కంటెంట్ ఆధారిత సినిమాలు, వాణిజ్యప‌ర‌మైన స‌క్సెస్ లతో ఆలియా సంచ‌ల‌నంగా మారుతోంది. ఆలియా కృషి - సంకల్పం త‌న‌న ప‌రిశ్ర‌మ‌లో సుస్థిర స్థానానికి చేర్చాయ‌ని చెప్పాలి. తల్లిదండ్రులు మహేష్ భట్ - సోనీ రజ్దాన్ తాము గ‌ర్వించే కూతురు అంటూ త‌న‌పై నిరంత‌రం పొగ‌డ్త‌లు కురిపిస్తుంటారు. అయితే ఆలియా భ‌ట్ ని నెపో కిడ్ అని.. బంధుప్రీతి ఆదుకుంద‌ని కంగ‌న లాంటి స్టార్ నిరంత‌రం విమ‌ర్శిస్తుంటారు. అయితే తాజా ఇంట‌ర్వ్యూలో ఆలియా నెపోటిజం గురించి ప్ర‌స్థావించింది. అలాగే తన తల్లి సోని ర‌జ్దాన్ నటిగా ఎదిగేందుకు ఎలా కష్టపడిందో కూడా రివీల్ చేసింది.

ఇన్‌స్టైల్ ఆస్ట్రేలియా మ్యాగ‌జైన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆలియా తన కుటుంబం 'ఒక‌ సినిమా ప్రపంచం' అని తెలుసుకున్నప్పుడు నటన‌పై సహజంగానే మొగ్గు చూపినట్లు తెలిపింది. నేను సహజంగానే న‌ట‌రంగం వైపు ఎక్కువ మొగ్గు చూపాను. కానీ మా నాన్న నాతో ఎమ‌నేవారంటే...''ఓహ్ నువ్వు నటించాలనుకునే రోజున మేం సినిమాలో అవ‌కాశం ఇస్తాం'' అని అన్నారు. కానీ నాన్న ఆ అవ‌కాశాన్ని నాకు ఎప్పుడూ ఇవ్వ‌లేదు. నిజానికి మా అమ్మ నటిగా చాలా కష్టపడింది. ఇది చాలా మందికి తెలియదు. ఆమె ఎప్పుడూ నటిగా ఎక్కువ పని కోసం వెతుకుతూనే ఉండేది. కానీ చివ‌రికి ఇదే పిచ్చితో తాను దర్శక నిర్మాతను వివాహం చేసుకుంది! అని తెలిపింది.

బంధుప్రీతి గురించి ప్ర‌స్థావిస్తూ.. సినీరంగంలో సులువుగా ప్ర‌వేశించేందుకు ఇది ఉప‌క‌రించింద‌ని తెలిపింది. ఇది చాలా రక్షణాత్మకంగా ఉంటుంది. అయితే నేను న‌టిగా ఎక్కువ కష్టపడుతున్నాననే విష‌యం మీకు తెలుసనే అనుకుంటాను.. కాబట్టి న‌న్ను ప్రశ్నించ‌డం ఎందుకు? అని అంది. సమయం వయస్సుతో పాటు ప్రపంచంలో చాలా పోరాటం చేయాల్సి ఉందని నేను భావిస్తున్నాను.. అని తెలిపింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. గంగూబాయి క‌తియావాడిలో తన అద్భుతమైన నటనకు ఆలియా భట్ ఈ సంవత్సరం జాతీయ అవార్డును అందుకుంది. చివరిగా 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో ఆలియా కనిపించింది. ర‌ణ‌వీర్- ఆలియా జంట‌గా న‌టించిన‌ రొమాంటిక్ డ్రామా అభిమానులకు నచ్చింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రం ఇప్పుడు OTTలో అందుబాటులో ఉంది. OTT వెర్షన్‌లో అదనపు 10 నిమిషాల సీన్స్ కూడా చేర్చారు. పరిమితి కారణంగా థియేటర్ వెర్షన్ నుండి కత్తిరించారు. హాలీవుడ్ చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్‌'లో కూడా ఆలియా కనిపించింది. అయితే ఇప్పటి వరకు ఆలియా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. త‌న భ‌ర్త ర‌ణ‌బీర్ తో క‌లిసి బ్ర‌హ్మాస్త్ర 2లో న‌టించాల్సి ఉంది.