Begin typing your search above and press return to search.

న్యూ డిజైన్ లో అలా జార విడిస్తే ఎలా?

తాజాగా మ‌రో హాట్ ఫోటోతో ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తుంది. అలియా న్యూ డిజైన్ లో సెగలు పుట్టించే అందాల‌తో ముందుకొచ్చేసింది. బ్లాక్ క‌ల‌ర్ ఔట్ ఫిట్ లో అమ్మ‌డు హొయ‌లు పొయింది.

By:  Tupaki Desk   |   3 Nov 2023 3:09 PM GMT
న్యూ డిజైన్ లో అలా జార విడిస్తే ఎలా?
X

బాలీవుడ్ సంచ‌ల‌నం అలియాభ‌ట్ టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఫోటో షూట్ కి త‌గ్గ‌ట్టు అమ్మ‌డు ఎలా మౌల్డ్ అవ్వాలో తెలిసిన తెలివైన బ్యూటీ. ఎలాంటి క్లిక్ ల‌తో యువ‌త‌రంలో దూసుకుపొవొచ్చో? ప‌ర్పెక్ట్ గా ప్లాన్ చేసుకుని మ‌రి వైవిథ్య‌మైన భంగిమ‌ల‌తో అల‌రించ‌డం అమ్మ‌డి స్సెషాల్టీ. క‌ష్టే ఫ‌లి అన్న ప‌దానికి అలియా ప‌ర్పెక్ట్ గా సూట‌వుతుంది.


ఇన్ స్టాలో ఆమె చేసిన ఏ ప్ర‌య‌త్నం వృద్ధా కాదు. స‌రిగ్గా స‌మ‌యం చూసుకుని ఒక్కో క్లిక్ ని మార్కెట్ లోకి వ‌దులుతుంది. అవి అంతే వాయు వేగంతో దూసుకుపోతాయి. తాజాగా మ‌రో హాట్ ఫోటోతో ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తుంది. అలియా న్యూ డిజైన్ లో సెగలు పుట్టించే అందాల‌తో ముందుకొచ్చేసింది. బ్లాక్ క‌ల‌ర్ ఔట్ ఫిట్ లో అమ్మ‌డు హొయ‌లు పొయింది. లిప్ట్ లో లాంగ్ షార్స్ట్ ..క్లోజ‌ప్ షార్ట్స్ లో అలియా లుక్ చూప‌రుల ను ఆకట్టుకుంటుంది.


మ‌రో పిక్ లో తడిపొడి అందాల‌తో క‌వ్వించేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్ లో మ‌రో స్నాప్ ని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. అలియా ఫాలోవ‌ర్లు అదే తీరును వీక్షించి త‌నివి తీరుతున్నారు. ఇక అలియా కెరీర్ గురించి చెప్పేదేముంది. జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంది. వ‌రుగా సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతుంది.

తెలుగులో అవ‌కాశాలు ఇస్తామ‌న్నా? చేయ‌నంత బిజీగా ఉంది. బాలీవుడ్ టూ హాలీవుడ్ మాత్ర‌మే అంటోం ది. ఇప్ప‌టికే హాలీవుడ్ లో 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈ సినిమా రిలీజ్ కి వ‌చ్చినంత గుర్తింపు రిలీజ్ త‌ర్వాత అలియా కి రాన‌ట్లే క‌నిపిస్తుంది. ఆ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌క‌పోవ‌మే అందుకు కార‌ణం.