Begin typing your search above and press return to search.

పెళ్లి చీరలో రాష్ట్రపతి భవన్‌కి.. ఆలియా సమాధానం

సాధారణంగా ఇలాంటి పెద్ద ప్రత్యేకమైన కార్యక్రమాలకు ఎప్పుడూ ధరించని విభిన్నమైన ఔట్‌ ఫిట్ లో కనిపించాలని కోరుకుంటారు

By:  Tupaki Desk   |   6 Nov 2023 1:15 PM GMT
పెళ్లి చీరలో రాష్ట్రపతి భవన్‌కి.. ఆలియా సమాధానం
X

ఆలియా భట్ ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న సమయంలో ధరించిన చీర గురించి రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఆమె పెళ్లికి ధరించిన చీర ను రాష్ట్రపతి భవన్ కి వెళ్లిన సమయంలో ధరించింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తే కొందరు మాత్రం కాస్త అటు ఇటుగా అలాంటి చీర అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఆ విషయమై ఆలియా భట్ ఫుల్‌ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకునేందుకు రాష్ట్రపతి భవన్‌ కి వెళ్లిన సమయంలో తాను ధరించిన చీర గతంలో తాను పెళ్లికి కట్టుకున్నదే అన్నట్లుగా చెప్పుకొచ్చింది. పెళ్లి చీరను ఎందుకు ధరించవలసి వచ్చింది అనే విషయాన్ని గురించి ఆలియా భట్ స్పందించింది.

సాధారణంగా ఇలాంటి పెద్ద ప్రత్యేకమైన కార్యక్రమాలకు ఎప్పుడూ ధరించని విభిన్నమైన ఔట్‌ ఫిట్ లో కనిపించాలని కోరుకుంటారు. కానీ తాను మాత్రం తనకు అత్యంత ముఖ్యమైన చీరను ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో కట్టుకోవాలని అనుకుంటాను.

నాకు పెళ్లి చీర చాలా స్పెషల్‌. ఆ స్పెషల్‌ చీరను చాలా స్పెషల్‌ కార్యక్రమంలో కట్టుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. నేను పెళ్లి చీర కట్టుకున్న సమయంలో నాకు ప్రత్యేకమైన అలంకారం అవసరం లేదు అనిపిస్తుంది. అంతే కాకుండా ఆ చీర నాకు తెలియని ఆనందంను కలిగిస్తుందని ఆలియా భట్‌ పేర్కొంది.

ఇక తన గురించి, తన కెరీర్‌, పెళ్లి గురించి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు మరియు ట్రోల్స్ గురించి స్పందిస్తూ తాను గతంలో వాటిని గురించి ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా అలాంటి పుకార్లు మరియు ట్రోల్స్ నా వద్దకు వస్తూనే ఉంటాయి. కానీ నేను వాటిని పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది.