Begin typing your search above and press return to search.

డబ్బు కోసం నటించాలంటే భయంగా ఉంది

తాజాగా జరిగిన ఆ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆలియా భట్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 6:53 AM GMT
డబ్బు కోసం నటించాలంటే భయంగా ఉంది
X

బాలీవుడ్ తో పాటు సౌత్ సినీ ఇండస్ట్రీ హీరోయిన్స్ ల్లో గొప్ప నటిమణుల జాబితా తీస్తే అందులో ఆలియా భట్‌ ముందు వరుసలో ఉంటారు అనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌ లో స్టార్‌ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న హీరోయిన్ ఆలియా అంటూ ఆమె అభిమానులతో పాటు చాలా మంది ఒప్పుకుంటారు.

జాతీయ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులను తన నటనతో మరియు అందంతో దక్కించుకున్న ఆలియా భట్ తాజాగా ఫిలింఫేర్‌ ఓటీటీ అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డును కూడా సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన ఆ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆలియా భట్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

నటి అన్నప్పుడు అన్ని తరహా పాత్రలు చేయాలి. అయితే అన్ని పాత్రలు కూడా అవార్డును తెచ్చి పెట్టేవిగా ఉండాలి అనుకుంటే మాత్రం కష్టం. ఈ మధ్య కాలంలో తనకు వరుసగా వస్తున్న అవార్డులు తనపై బాధ్యతను మరింతగా పెంచుతున్నాయి. అన్ని మంచి పాత్రలు చేయాలని ఈ అవార్డులు చెప్పకనే చెబుతున్నాయి.

ప్రతిసారి అవార్డు వచ్చే స్థాయిలో నటించడం కష్టం. అంతే కాకుండా ప్రతి సారి అద్భుతమైన నటన కనబర్చడం కష్టం అని ఆలియా పేర్కొన్నారు. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాల నేపథ్యంలో డబ్బులు తీసుకుని కమర్షియల్‌ పాత్రల్లో నటించేందుకు భయంగా ఉందని, అలా నటించిన ఆలియా ఇలా చేశారేంటి అంటారేమో అనే టెన్షన్ ఉందని ఆలియా చెప్పుకొచ్చింది.

తల్లి అయిన తర్వాత కూడా ఆలియా ఏమాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది. సౌత్‌ లో మంచి ఆఫర్లు వస్తే తప్పకుండా మరిన్ని సినిమాలు చేసేందుకు కూడా సిద్దం అంది. ఇక సినిమాలతో పాటు ముందు ముందు మరిన్ని ఓటీటీ ప్రాజెక్ట్‌ ల్లో నటించేందుకు సిద్ధం అన్నట్లుగా ఆలియా ప్రకటించారు.