Begin typing your search above and press return to search.

లేట్ అయినా లేటెస్ట్- అలియా మైండ్ బ్లాక్ బికినీ

తాజాగా ఈ బ్యూటీ చేసిన ఇన్ స్టా పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. న్యూఇయర్ వెకేషన్ లో దిగిన మిర్రర్ సెల్ఫీలతో పాటు వీడియోలను పోస్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   7 Jan 2024 3:57 AM GMT
లేట్ అయినా లేటెస్ట్- అలియా మైండ్ బ్లాక్ బికినీ
X

బాలీవుడ్ క్యూట్ బ్యూటీగా పేరు దక్కించుకుని స్టార్‌ హీరోయిన్ గా ఎదిగిన ముద్దుగుమ్మ ఆలియా భట్. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌బీర్ కపూర్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2022 నవంబర్‌ లో పండంటి ఆడబిడ్డకు కూడా ఆలియా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.


సాధారణంగా కొందరు హీరోయిన్లు పిల్లలు పుట్టగానే కెరీర్ ముగిసింది అనుకుంటారు. కానీ ఆలియా మాత్రం బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే షూటింగ్ హాజరై వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అటు సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తుంది. కొత్త కొత్త ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తుంటుంది. కెరీర్, పర్సనల్, బిజినెస్ అప్డేట్లు షేర్ చూస్తూ యాక్టివ్ గా ఉంటోంది.


తాజాగా ఈ బ్యూటీ చేసిన ఇన్ స్టా పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. న్యూఇయర్ వెకేషన్ లో దిగిన మిర్రర్ సెల్ఫీలతో పాటు వీడియోలను పోస్ట్ చేసింది. Many moods & a million mirror selfies అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆ పిక్స్ లో రణ్ బీర్, రాహా లేకపోయినా తన నేచురల్ లుక్స్ తో ఆలియా ఆకట్టుకుంది. సింపుల్ ఫ్రాక్స్ లో తన అందంతో మైమరిపించింది. పింక్ కలర్ స్విమ్ షూట్ లో గ్లామర్ తో అదరగొట్టింది. స్కై కలర్ డ్రెస్ లో సముద్రాన్ని ఫిదా చేసేసింది!


ఆలియా తన భర్త, నటుడు రణ్ బీర కపూర్, కుమార్తె రాహాతో కలిసి న్యూఇయర్ వేడుకలు జరుపుకుని శుక్రవారమే ముంబయి చేరుకుంది. ఆ సమయంలో రాహాను క్లిక్ మనిపించేందుకు ఫొటోగ్రాఫర్లు తెగ పోటీపడ్డారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. క్రిస్మస్ సందర్భంగా తొలిసారి రాహా ఫేస్ రివీల్ చేశారు రణ్ బీర్, ఆలియా. ఇప్పటికీ క్యూటీ రాహా పిక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.


ఇటీవల గంగూబాయ్ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న ఆలియా భట్ ప్రస్తుతం హిందీలో పలు సినిమాల్లో నటిస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో కాస్త బ్రేక్ తీసుకున్న ఆలియా భట్‌ మళ్లీ స్పీడ్ పెంచింది. డైరెక్టర్ వాసన్ బాలా తెరకెక్కిస్తున్న జిగ్రాలో కనిపించనుంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్న జీ లే జరాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెతోపాటు కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా నటించనున్నారు. మరోవైపు, సినిమాలతోపాటు క్లాతింగ్ బిజినెస్ లో కూడా దూసుకెళ్తోంది.